RRR: Ram Charan And Jr NTR In New Pic ‘ఆర్ఆర్ఆర్’ నుంచి కొత్త పోస్టర్.. అభిమానులూ.. అక్టోబర్.!

Rrr new poster out ram charan and jr ntr wrap up dubbing in 2 languages

Jr NTR, Ram Charan, Mega Power star, Young tiger, SS Rajamouli, RRR poster, Rajamouli NTR, SS Rajamouli poster, Kumaram Bheem, October !3, Daserra, Alluri SitaramaRaju, Tollywood, Entertainment, movies

SS Rajamouli’s RRR, which resumed shooting post lockdown, will soon wrap up the film. On Tuesday (June 29), the makers took to Twitter to share a new poster of Ram Charan and Jr NTR on a motorbike with an update.

‘ఆర్ఆర్ఆర్’ నుంచి కొత్త పోస్టర్.. అభిమానులూ.. అక్టోబర్.!

Posted: 06/29/2021 10:09 PM IST
Rrr new poster out ram charan and jr ntr wrap up dubbing in 2 languages

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం, రణం, రుధిరం’. ఈ చిత్రానికి సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా అభిమానులు ఫుల్ జోష్ వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఇప్పటివరకు విడుదల చేసిన రామ్, భీమ్ వీడియోలు రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించడమే. అదీకాక నటీనటులకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ కూడా అనేక వ్యూస్ రావడం గమనార్హం.

ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో వుందన్న వార్తల నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి మరో అప్ డేట్ కూడా లభించింది. అనుకున్న ప్రకారమే ఈ చిత్రాన్ని ఈ దసరా (అక్టోబర్ 13న) విడుదల చేసేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది. ముగింపుదశలో వున్న ఈ చిత్రం రెండు పాటల మినహా పూర్తి పార్టు రెడీ అయ్యిందని చిత్రవర్గాలు వెల్లడించాయి, చెర్రీ, తారక్ ఇద్దరూ షూటింగులో పాల్గొంటున్నారు. దీనికి తోడు తారక్, చెర్రీ రెండు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేశారు.

సాధ్యమైనంత త్వరగా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తవుతుందని రాజమౌళి అన్నారు. మంగళవారం ఉదయం ఈ సినిమానుండి మరో కిరాక్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. ఎన్టీఆర్ బుల్లెట్ నడుపుతుండగా అతని భుజాలపై చేతులు వేసి చరణ్ వెనుక కూర్చుని ఉన్నాడు. ఈ పోస్టర్ మెగా – నందమూరి అభిమానులను, సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ ఆడియెన్స్ ముందుకు రానుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr NTR  Ram Charan  SS Rajamouli  RRR poster  Kumaram Bheem  Alluri SitaramaRaju  October !3  Daserra  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh