Satyadev's Thimmarusu on July 30 ఈ నెలలోనే వచ్చేస్తానంటున్న ‘తిమ్మరుసు’

Satyadev s thimmarusu to release in theatres on july 30

Sharan Kopishetty, Satyadev, Priyanka Jawalkar, Thimmarusu, legal drama, first Telugu film, post lockdown, Uma Maheswara Ugra Roopasya, SriCharan pakala, Tollywood, Movies, Entertainment

Satyadev’s Telugu film Thimmarusu is all set to release in theatres on July 30. Directed by Sharan Koppisetty, the film revolves around a righteous lawyer played by Satyadev, who wants justice to prevail in the world. Priyanka Jawalkar will play the female lead in the film. Thimmarusu is the first Telugu film to release in theatres post lockdown in 2021.

థియేటర్లకు ఈ నెలలోనే వచ్చేస్తానంటున్న ‘తిమ్మరుసు’

Posted: 07/09/2021 03:53 PM IST
Satyadev s thimmarusu to release in theatres on july 30

అతల్ప బడ్జెట్ తో అత్యంత ఆదాయాన్ని సమకూర్చి పెట్టే టాలీవుడ్ యువహీరోల్లో.. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంతో సత్యదేవ్ పేరు కూడా చేరిపోయింది. విభిన్నమైన పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్న సత్యదేవ్.. అనతికాలంలోనే సినీపరిశ్రమలో చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. సత్యదేవ్ ఏ పాత్రను పోషించినా, ఆ పాత్రలో ఇమిడిపోవడం కూడా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక కథల పరంగానూ ఆయన కథల్లో బలం కూడా జత కలిస్తే బాగుంటుందని అభిప్రాయపడతుంటారు.

నూతన దర్శకులతో తాను మేళవితమై అభినయానికి పెద్దపీట వేస్లాడు. దీంతో సత్యదేవ్ చిత్రాల కోసం కూడా తెలుగు ప్రేక్షకులు వేచిచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రంగా 'తిమ్మరుసు' గురించి మంచి అప్ డేట్ లభించింది. ఆయన నటించిన తిమ్మరుసు చిత్రం షూటింగును పూర్తిచేసుకుంది. ఈ పాటికే ఈ సినిమా విడుదల కావలసింది. కానీ కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది.

ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తూ, రిలీజ్ డేట్ పోస్టర్ ను వదిలారు. మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సత్యదేవ్ సరసన నాయికగా ప్రియాంక జవాల్కర్ నటించగా, ఒక కీలక పాత్రలో రవిబాబు కనిపించనున్నాడు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ, అంకిత్, కోనేరు, తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharan Kopishetty  Satyadev  Priyanka Jawalkar  Thimmarusu  SriCharan pakala  Tollywood  

Other Articles