యువహీరో నాగశౌర్యకి కొంతకాలంగా సరైన హిట్ లేదనే చెప్పాలి. ఆయన సొంతంగా కథను రూపోందించిన అశ్వధ్దామ చిత్రం.. కథాపరంగా, చిత్రీకరణ అంతా బాగుంది. అయినా కరోనా కష్టకాలం నేపథ్యంలో ఆ చిత్రం ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే నాగశౌర్య సంకల్పించుకున్నాడు. దీంతో ఆయన తాజా చిత్రంగా 'లక్ష్య' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అయినా ప్రేక్షకులు పూర్తిగా ఆదరించి తనకు చక్కటి హిట్ అందిస్తారని ఆశిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది.
కాగా తాను నటిస్తున్న 'వరుడు కావలెను' సినిమాను కూడా పూర్తిచేసే పనిలో ఉన్నాడు నాగశౌర్య. కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్ ను.. అన్ లాక్ నేపథ్యంలో మంచి రోజు చూసుకుని షూటింగ్ ప్రారంభించాలని చూసిన చిత్రబృందానికి ఏరువాక పౌర్ణమి సందర్భంగా షూటింగ్ ప్రారంభించారు. దీంతో ఈ రోజున మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. ఈ షెడ్యూల్లో నాగశౌర్య .. రీతూ వర్మ కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమాకి లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ సగానికి పైగా షూటింగును పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా తెలుస్తోంది. నాగశౌర్య మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more