Suresh Productions launches music label ‘SP Music’ సురేశ్ ప్రోడక్షన్స్ నుంచి ఎస్.పి మ్యూజిక్ లాంచ్

Suresh productions ventures into music industry with sp music

suresh productions, suresh productions music, sp music, sp music label, suresh productions movies, rana daggubati, venkatesh daggubati, D RamaNaidu, D Suresh Babu, Suresh Productions, SP Music, Suresh Productions Music, Music World, Tollywood, Movies, Entertainment

Suresh Productions on Thursday entered the music industry with the launch of SP Music. The renowned production house, established by the late Daggubati Ramanaidu in 1964, announced the launch of the music label on Twitter.

సురేశ్ ప్రోడక్షన్స్ నుంచి ఎస్.పి మ్యూజిక్ లాంచ్

Posted: 06/24/2021 07:56 PM IST
Suresh productions ventures into music industry with sp music

తెలుగు సినిమా రంగంలో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థది ఓ విశిష్టాధ్యాయం. ప్రముఖ నిర్మాత డాక్టర్ డి రామానాయుడు సినీరంగంలో నాటిన మొక్క ఇవాళ ఓ మహావటవృక్షంగా పెరిగి చిత్రసీమలో ఎందరెందరికో జీవితాలను ప్రసాదించింది. తనదైన చిత్ర కథలను ఎంపిక చేసుకని వాటిని మాత్రమే నిర్మించే ఈ సంస్థ.. అనేక విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. నూతన నటీనటులకు అవకాశం కల్పిస్తూ వారిని తెలుగు ప్రేక్షకులు మరింత ఆదరంచేలా చేసింది. ఆ సంస్థ నుంచి ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తారు.

డి.రామానాయుడు 1964లో నెలకొల్పిన సురేశ్ ప్రొడక్షన్స్ తమ తొలి ప్రయత్నంగా ఎన్టీఆర్ తో 'రాముడు-భీముడు' చిత్రాన్ని నిర్మించి ఘన విజయంతో తమ ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. అనంతరం ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి ఎందరో నిర్మాతలకు ఆదర్శంగా నిలిచింది. ఇప్పటికి వివిధ భాషలలో సుమారు 124 సినిమాలు నిర్మించి తనదైన ముద్ర వేసింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న ఈ సురేశ్ సంస్థ ఇప్పుడు తాజాగా సంగీత ప్రపంచంలోకి కూడా ప్రవేశిస్తోంది.

ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఈ రోజు ఓ ప్రకటన చేసింది. 'ఏభై సంవత్సరాల మా సినిమా వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ.. సురేశ్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ పేరిట సంగీత ప్రపంచంలోకి కూడా ప్రవేశిస్తున్నామని తెలియజేయడానికి ఆనందిస్తున్నాం. వినసొంపైన, వీనులవిందైన సంగీతాన్ని అందించడమే మా లక్ష్యం" అంటూ సదరు సంస్థ పేర్కొంది. దీనితో పాటుగా 'సురేశ్ ప్రొడక్షన్స్ మ్యూజిక్'కు సంబంధించిన లోగోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles