Naga babu on Prakash Raj over MAA Elections ‘చిరంజీవి’ మద్దతు తమకేనన్న మెగా బ్రదర్

Maa elections 2021 nagababu says prakash raj has chiranjeevi support

Nagababu, Chiranjeevi, Megastar support, Prakash raj, maa elections 2021, maa elections, maa elections 2021 date, maa president telugu election, maa association president election, jeevitha, prakash raj, manchu vishnu, hema actress, maa news, maa president, maa association president, jayasudha, sudigali sudheer, srikanth, prakash raj news, tollywood, movies, entertainment

After the announcement of Prakash Raj panel members, Mega Brother, Producer and actor Nagababu declares that Prakash Raj has Megastar Chiranjeevi support. This pannel includes only the hard, sincere and dedicated members adds Nagababu.

MAA Elections 2021: ‘చిరంజీవి’ మద్దతు తమకేనన్న మెగా బ్రదర్

Posted: 06/25/2021 03:49 PM IST
Maa elections 2021 nagababu says prakash raj has chiranjeevi support

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలలో ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ కు మద్దత్తునిస్తున్న సినీన‌టుడు, మెగాబ్రదర్ నాగ‌బాబు మీడియాతో మాట్లాడుతూ మా అసోసియేషన్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంతో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఎన్నికల బరిలో దిగుతున్నారని అన్నారు. ప్ర‌కాశ్ రాజ్ చాలా మంచి వ్య‌క్త‌ని, మా అసోసియేష‌న్ ప్ర‌తిష్ఠ మ‌రింత పెంచేందుకు బరిలో దిగిన ఆయనకు మెగాస్టార్ చిరంజీవి మద్దుతు కూడా వుందని తెలిపారు. ఇక ఆయనపై నాన్ లోకల్ అన్న ప్రచారాన్ని చాలా తేలిగ్గా తోసిపుచ్చారు.

'ప్ర‌కాశ్ రాజ్ కు ప్ర‌తి భాష‌తో ట‌చ్ ఉంది. ఎవ‌రితోనైనా స‌రే వారి భాష‌లో మాట్లాడ‌గ‌లిగే స‌త్తా ఉన్న వ్య‌క్తి ఆయనని..  ఎవ‌రితోనూనా ఏ ప‌ని అయినా స‌రే చేయించుకోగ‌లిగే సత్తా వున్న వ్య‌క్తి ఆయనని చెప్పారు. అంతేకాదు, ప్ర‌కాశ్ రాజ్ నాలుగైదు ఏళ్లుగా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు' అని నాగ‌బాబు తెలిపారు. 'మూడు-నాలుగు గ్రామాలు ద‌త్త‌త తీసుకుని సేవ‌లు అందిస్తున్నారు. చాలా మందికి ఇళ్లు క‌ట్టించారు. చాలా మందికి సాయం చేశారు. ఇటువంటి వ్య‌క్తి మా లో ఉంటే ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న‌ను సంప్ర‌దించొచ్చు.

మా అసోసియేషన్‌ మాది అనే భావ‌న క‌లుగుతుంది. ఇందాక ప్ర‌కాశ్ రాజ్ కూడా ఇది ప్ర‌స్తావించారు' అని నాగ‌బాబు చెప్పారు. 'లోకల్, నాన్ లోక‌ల్ అంటూ వాదిస్తున్నారు. అలా వాదించ‌డం అర్థ‌ర‌హితం. ఎందుకంటే మా అసోసియేష‌న్‌లో స‌భ్యత్వం తీసుకున్న ప్ర‌తి వ్య‌క్తికి మా అధ్య‌క్ష ప‌దవి నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ దాకా పోటీ చేసే అవ‌కాశం ఉంటుంది. అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి గొప్ప న‌టుడు త‌న‌ను బాలీవుడ్ న‌టుడు అని అన‌కూడ‌ద‌ని, భార‌తీయ న‌టుడు అనాల‌ని అన్నారు. ప్ర‌కాశ్ రాజ్ కూడా ఎక్క‌డ పుట్టాడు.. ఎక్క‌డ పెరిగాడు అన్న విష‌యం అన‌వ‌స‌రం' అన్నారు నాగ‌బాబు.

'లోక‌ల్ కి, నాన్ లోక‌ల్ కి ప్రామాణికం ఏమిటి? అమెరికాలోనే ఇటువంటి ఫీలింగులు లేవు. ఇలాంటి ఫీలింగులే ఉంటే అమెరికాలో క‌మ‌లా హ్యారీస్ ఉపాధ్య‌క్షురాలు అయ్యేవారా? అన్న‌య్య ఆశీర్వాదాలు కూడా మ‌న‌కు ఉన్నాయి. దీనికి సంతోషిస్తున్నాం. అన్న‌య్య‌ను ప్ర‌కాశ్ రాజ్ గారు అడిగిన‌ప్పుడు .. 'మా'లో పోటీ చేయాల‌ని అన్న‌య్య చెప్పాడు' అని నాగ‌బాబు చెప్పారు. 'అయితే, తాను నేరుగా ఇన్వాల్వ్ కాన‌ని చెప్పారు. కానీ, మా అసోసియేష‌న్ మంచి ప‌నులు చేస్తే మ‌ద్ద‌తుగా ఉంటాన‌ని చెప్పారు. ప్ర‌కాశ్ రాజ్ చాలా స‌మ‌ర్థ‌త‌గ‌ల వ్య‌క్తి. కొన్నేళ్లుగా మా అసోసియేష‌న్ ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారింది. ఇక‌పై అలా ఉండ‌కూడ‌దు" అని నాగ‌బాబు వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles