Jagapathi Babu roped in for Rajinikanth’s ‘Annaatthe’ రజనీకాంత్ పక్కన హ్యాట్రిక్ విలన్ గా నిన్నటి హీరో.!

As rajinikanth s annaatthe shoot resumes in chennai jagapathi babu joins the cast

Annaatthe, Rajinikanth, Jagapathi Babu, JagguBhai, Thalaiva, Nayanthara, Keerthy suresh, Siva, Rajinikanth, Annaatthe, Annaatthe release date, Annaatthe news, Jagapathi Babu, Khushbu, Meena, Prakash Raj, Nayanthara, Keerthy Suresh, Sathish and Soori, Kollywood, Tamil movie, Tollywood, movies, entertainment

The makers of one of the most anticipated Tamil movies, Annaatthe starring Rajinikanth in the lead, announced that popular actor Jagapathi Babu has been roped in for the movie. Sun Pictures took to Twitter to share a small introductory video and announced that the actor will be joining the cast of Annaatthe.

రజనీకాంత్ పక్కన హ్యాట్రిక్ విలన్ గా నిన్నటి హీరో.!

Posted: 03/17/2021 08:00 PM IST
As rajinikanth s annaatthe shoot resumes in chennai jagapathi babu joins the cast

ఫ్యామిలీ అడియన్స్ మదిలో మరో గొప్ప నటుడిగా మెప్పించి.. అలనాటి అందాల నటుడు శోభన్ బాబును మరిపించిన జగపతిబాబు.. తన సెకెండ్ ఇన్నింగ్స్ లో విలక్షణమైన  పాత్రలను పోషిస్తూ ఓ వైపు తండ్రిగా, మరోవైపు ప్రతినాయకుడిగా తనలోని అన్ని కోణాలను అవిష్కరించి.. తనదైన ప్రదర్శనలు ఇస్తున్నాడు. పవర్ ఫుల్ పాత్రలు పోషిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకుంటున్న నిన్నటి హీరో.. ఇప్పుడు తనకంటే సీనియర్ హీరోలకు కూడా విలన్ గా నటిస్తున్నాడు.

స్టార్ హీరోలకు దీటుగా విలన్ పాత్రలను కూడా ఆయన సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే, సెకండ్ ఇన్నింగ్స్ లో ఖాళీ అన్నది లేకుండా పలు సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న సినిమాలో కూడా కీలక పాత్ర పోషించడానికి జగపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' పేరిట తాజాగా ఓ భారీ చిత్రనిర్మాణం జరుగుతోంది.

ఆమధ్య ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో కూడ జరిగింది. ఇందులో జగపతి నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా వెల్లడిస్తూ.. జగపతికి తమ బృందంలోకి స్వాగతం పలికింది. కాగా, ఇందులో ఆయన నెగటివ్ టచ్ తో సాగే పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంచితే, గతంలో రజనీకాంత్ తో కలసి 'కథానాయకుడు', 'లింగా' సినిమాలలో జగపతిబాబు నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Annaatthe  Rajinikanth  Jagapathi Babu  JagguBhai  Thalaiva  Nayanthara  Keerthy suresh  Siva  Kollywood  Tamil movie  

Other Articles

Today on Telugu Wishesh