Sathyameva Jayathe elevates Pawan Kalyan's image పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ నుంచి ‘సత్యమేవ జయతే’ సాంగ్

Sathyameva jayathe lyrical song from vakeel saab pawan kalyan

Pawan Kalyan, Vakeel saab, Lavanya Tripathi, pawan kalyan Lavanya Tripathi vakeel saab, pawan kalyan vakeel saab Lavanya Tripathi, pspk 26, pink remake Lavanya Tripathi, Lavanya Tripathi pink, Lavanya Tripathi Nivetha Thomas, Nivetha Thomas, Anjali, Ananya, nerkonda paarvai, Venu Sriram, Nivetha Thomas, Anjali, Ananya, #pspk26, movies, entertainment, tollywood

The second song from ‘Vakeel Saab’ is here. The lyric that goes as “Jana Jana Jana Janaganamuna Kalagalisina Janam Manishi Raa….” Certainly elevates the off-screen and on-screen image of Pawan Kalyan. Shankar Mahadevan’s rendition has added more depth to the lyrics written by Ramjogayya Sastry.

పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ నుంచి ‘సత్యమేవ జయతే’ సాంగ్

Posted: 03/03/2021 05:48 PM IST
Sathyameva jayathe lyrical song from vakeel saab pawan kalyan

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మగువా.. మగువా అనే చిత్రాన్ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రానికి చక్కని సంగీతాన్ని సమకూర్చారు ఎస్ఎస్ తమన్. కరోనా అన్ లాక్ నుంచి ఈ చిత్రం షూటింగ్ అంతా ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం చకచకా జరిగిపోతోంది.

పవన్ కల్యాన్ అభిమానులంతా చిత్రం నుంచి మరో అప్ డేట్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్రమంలో మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. తాజాగా ‘వకీల్ సాబ్’ చిత్రం నుంచి మరో గీతం విడుదలైంది. "మన తరఫున నిలబడగల నిజం మనిషిరా.." అంటూ సాగే ఈ పాటను చిత్రబృందం ఆన్ లైన్ లో పంచుకుంది. తమన్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. బాలీవుడ్ లో ప్రజాదరణ పొందిన పింక్ చిత్రానికి రీమేక్ గా వకీల్ సాబ్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

వకీల్ సాబ్ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక కాగా... అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కథకు అవసరమైన కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. పవర్ స్టార్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హిందీ .. తమిళ భాషల్లో ఆదరణ పొందిన ఈ కథ, తెలుగులో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pspk 26  Vakeel saab  Pawan Kalyan  Lavanya Tripathi  Nivetha Thomas  Anjali  Ananya  Venu Sriram  tollywood  

Other Articles