Mahesh Babu unveils ‘Naa Kanulu Yepudu’ from Rang De రంగ్ దే నుంచి మరో లిరికల్ సాంగ్.. లాంచ్ చేసిన మహేశ్ బాబు

Keerthy suresh and nithiin s rang de s third track naa kanulu yepudu out now

Rang De, Nithin, Keerthi Suresh, Devi Sri Prasad, Venky Atluri, Mahesh Babu, Sid Sriram, suryadevara nagavamsi, Movie News, Tollywood, Entertainment

Southern beauty Keerthy Suresh has been constantly sharing updates of her upcoming film Rang De on her social media. Fans of the actor have been anticipating the release of the third track of the movie Naa Kanulu Yepudu. Much to her fans' delight, on March 4, Keerthy took to her social media to announce that the song is out now.

రంగ్ దే నుంచి మరో లిరికల్ సాంగ్.. లాంచ్ చేసిన మహేశ్ బాబు

Posted: 03/04/2021 06:19 PM IST
Keerthy suresh and nithiin s rang de s third track naa kanulu yepudu out now

టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. ‘‘నా కనులు ఎపుడూ కననే కనని... ’’అంటూ ఈ సాగే గీతానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా, శ్రీమణి సాహిత్యం అందించారు. సిద్ శ్రీరామ్ హృద్యంగా ఆలపించారు. దేవి సంగీత దర్శకత్వంలో సిద్ శ్రీరామ్ పాడిన మొదటి పాట ఇదే.

ఈ పాటను సోషల్ మీడియాలో పంచుకున్న మహేశ్ బాబు.... రాక్ స్టార్ డీఎస్పీ, సిద్ శ్రీరామ్ ఎల్లప్పుడూ ఉర్రూతలూగిస్తుంటారు అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే  ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.  పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై  భారీ హైప్‌ క్రియేట్‌  చేశాయి. మార్చి 26 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు  చెక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్‌ ఈ సినిమా కూడా బంపర్‌హిట్‌ అనే  అంచనాలతో ఉన్నారు. సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న రంగ్ దే చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles