Income Tax raid at Taapsee, Anurag Kashyap's residence బాలీవుడ్ ప్రముఖులపై ఆదాయపన్ను శాఖ దాడులు..

Bollywood celebrities who have faced income tax department raids

Anurag Kashyap, Taapsee Pannu, Income Tax, Taapsee Pannu News, Anurag Kashyap News, Actor Taapsee Pannu,Taapsee Pannu Latest News, Filmmaker Anurag Kashyap, Anurag Kashyap News Today,Income Tax Raids, Income Tax Raids news, Pune, mumbai, Maharashtra, Bollywood, Tollywood

The residence of Bollywood filmmakers Anurag Kashyap, Vikas Bahl, actress Taapsee Pannu and others have been raided by the Income Tax department in Mumbai. According to the IT Department, the raised were conducted in the case of tax evasion.

బాలీవుడ్ ప్రముఖులపై ఆదాయపన్ను శాఖ దాడులు..

Posted: 03/03/2021 05:04 PM IST
Bollywood celebrities who have faced income tax department raids

పన్ను ఏగవేతకు పాల్పడ్డారన్న అరోపణలు రావడంతో బాలీవుడ్ ప్రముఖ టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను, వికాస్ బాల్ సహా పలువురు ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. పన్నులు ఎగవేశారన్న అరోపణలపై తమకు పిర్యాదులు అందడంతో ముంబయి, పూణే సహా 30 ప్రాంతాలలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. దాడుల్లో భాగంగా ఐటీ అధికారులు ఫాంటమ్ సంస్థలోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మధు మంతెనకు చెందిన ఇళ్లు కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

వీరితో పాటు నైపుణ్య నిర్వహణ సంస్థ క్వాన్ ను కార్యాలయంలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సంస్థపై గత ఏడాది బాలీవుడ్ అగ్రహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంచిన తరువాత నార్కోటిక్స్ బ్యూరో కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. ఇక ఫాంటమ్ ఫిల్మ్స్ లో భాగస్వామిగా వున్న విక్రమాధిత్య మోత్వానీ ఇంటిపై కూడా అదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. కాగా ప్రస్తుతం ఐటీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఫాంటమ్ తో సంబంధమున్న వ్యక్తులే లక్ష్యంగా దాడులు చేశారు. కాగా, 2011లో విక్రమాదిత్య మోత్వానీ, మధు మంతెన, వికాస్ బల్ తో కలిసి ఫాంటమ్ ఫిల్మ్స్ ను అనురాగ్ కశ్యప్ ఏర్పాటు చేశారు. హసీతో ఫసీ, షాన్ ధార్ అనే చిత్రాలను కూడా ఫాంటమ్ సంస్థ నిర్మించింది. అయితే, 2018లో వికాస్ బల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, ఆయనపై కేసు నమోదు కావడంతో సంస్థను మూసేశారు. అయినా రెండేళ్ల తరువాత ఈ సంస్థపై దాడులు ఐటీ అధికారులు దాడులు చేయడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక కేంద్రంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్న వారినే టార్గటె్ గా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పిన తాస్పీ పొన్ను.. మరో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నుంచి ఎదురైన విమర్శలకు గట్టిగానే బదులిచ్చారు. అమెతో పాటు సమయం వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంపై అనురాగ్ కశ్యప్, వికాస్ బాల్ కూడా తమ గళాన్ని వినిపించారు. అయితే తనపై విమర్శలు చేసిన కారణంగానే కేంద్రం ఈ దాడులకు పురమాయించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles