Rana Daggubati Gets Engaged to Miheeka Bajaj రానాపై ప్రేమను తొలిసారి బయటపెట్టిన మిహికా బజాబ్

Rana daggubati gets engaged to miheeka bajaj at ramanaidu studios

Rana Daggubati, Miheeka Bajaj, rana miheeka, rana marriage, rana engagement, rana daggubati, rana daggubati marriage pics, rana engagement pics, tollywood, movies, entertainment

Actor Rana Daggubati got engaged to his girlfriend Miheeka Bajaj in a private ceremony on Wednesday, and took to social media to share pictures from the event that took place at Ramanaidu Studios in Hyderabad.

రానాపై ప్రేమను తొలిసారి బయటపెట్టిన మిహికా బజాబ్

Posted: 05/22/2020 02:32 PM IST
Rana daggubati gets engaged to miheeka bajaj at ramanaidu studios

ప్రముఖ నటుడు దగ్గబాటి రానాను పరిణయం ఆడబోతున్న మిహికా బజాబ్ తొలిసారి ఆయననపై తనకున్న ప్రేమను బయటపెట్టారు. ఇప్పటి వరకు తన కుటుంబం, స్నేహితులు, సర్కిల్ వరకు మాత్రమే పరిమితం అయిన ఆమె రానాకు కాబోయే సతీమణి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్త రానా అభిమానులకు కూడా మిహికా బజాజ్ సుపరిచితురాలిగా మారారు. తాజాగా రానా, మిహికాల ‘రోకా’ వేడుకగా హైదరాబాద్లో సందడిగా జరిగింది.

ఈ వేడుకల గురించి తెలియని మనవాళ్లు రానా, మిహికాల నిశ్చితార్థం పూర్తైయ్యందని.. భావించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి. కానీ వాటన్నింటినీ నిర్మాత సురేష్ బాబు తోసిపుచ్చారు. ఉత్తరాది సంప్రదాయాల్లో ఘనంగా జరుపుకొనే ఈ వేడుకలో వరుడు, వధువు కుటుంబాలకు చెందిన పెద్దలు ఒకచోట కలుసుకుని పెళ్లి పనులు, నిశ్చితార్థం గురించి చర్చించుకుంటారు. ఈ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలను రానా ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘ఇక మా బంధం అధికారికమైంది’ అని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే మిహికా సైతం తనకు కాబోయే భర్త రానాతో దిగిన రెండు ఫొటోలను ఇన్‌స్టా వేదికగా మొదటిసారి షేర్‌ చేశారు. ‘నా ప్రియమైన రానాతో కలిసి జీవితం ప్రారంభం’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. రానాతో నవ్వులు పూయిస్తున్న మరో ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘మై హ్యాపీ ప్లేస్‌ @ రానా‌’ అని తెలిపారు. మిహికా పెట్టిన పోస్టులు చూసిన సినీ ప్రముఖులు, బజాజ్‌ కుటుంబసభ్యులు, నెటిజన్లు సంతోషించారు. ‘కంగ్రాట్స్‌ మిరా (మిహికా+రానా)’, ‘లవ్లీ కపుల్‌’, ‘చూడముచ్చటైన జంట’, ‘మీ కథ ఎంతో మధురమైనది. మీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. బజాజ్‌ కుటుంబంలోకి రానాకు స్వాగతం’ అని కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles