అదరించే వాడు లేకపోతే ఏ కళకు ప్రోత్సాహం లేదు. అలాగే అభిమాని అంటూ లేని నాడు ఏ వ్యక్తి నటుడిగా ఎదగలేదు. నటుడిగా ఎదగలేని ఏ వ్యక్తి స్టార్ గా నిలువలేదు. ఇక స్టార్ గా ఎదిగిన తరువాత తన స్టార్ డమ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నటులపై ఎప్పటికీ వుంటుంది. ప్రస్తుతం సినీ ప్రపంచపు హీరోలకు అభిమానులే పెద్ద బలం. హీరోలకు వారే కొండంత అండ. ఈ తరహా అభిమానం ఉంది కాబట్టే చిత్ర పరిశ్రమ, టెలివిజన్ పరిశ్రమలు రాణిస్తున్నాయి.
తమ అభిమాన సీరియల్ వస్తుందంటే చాలు ఎక్కడి పనులు అక్కడే పెట్టి.. ఎంచక్కా టీవీ అన్ చేసుకుని సీరియల్ చూస్తారు. ఇక తమ ఫేవరేట్ హీరో కొత్త సినిమా వస్తుందంటే చాలు.. ముందురోజు వెళ్లి ధీయేటర్లపైనే తమ అభిమానాన్ని చాటుకునేట్లుగా రంగురంగు కాయితాలతో ముస్తాబు చేస్తారు. ఇక మరికొందరు డిజిటల్ మీడియా ఫ్యాన్స్.. ఆ చిత్రంలో తమ హీరో లుక్ ఇలా వుంటే బాగుంటుందని, పోస్టర్ ఇలా వుంటే బాగుంటుందని అంచనాలతో క్రేజీగా ఫ్యాన్ మేడ్ పోస్టర్లను రూపోందిస్తుంటారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాని కూడా అదే పంథాలో ఓ కొత్త పోస్టర్ విడుదల చేశాడు. మహేష్ బాబుని రాముడి గెటప్ లో రూపొందించిన ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ గా చక్కర్లు కొడుతోంది. ఇక టాలీవుడ్ ప్రిన్స్ అభిమానులకు మాత్రం ఈ పోస్టర్ ఎంత నచ్చిందో మాటల్లో చెప్పనలవికాదు. సాదారణ ప్రేక్షకులకే విపరీతంగా నచ్చేసిన ఈ పోస్టర్ ను మహేష్ అభిమాని నెట్టింట్లో పెట్టడంతో అదికాస్తా అంతర్జాలంలో విపరీతంగా చక్కర్లు కోడుతోంది.
ఇంతకీ ఈ పోస్టర్ కు ఆజ్యం పోసిందేమిటీ అంటే.. జక్కన్నగా పేరొందిన ప్రముఖ దర్శకదిగ్గజం రాజమౌళి రణం, రౌద్రం, రుధిరం (ఆర్ఆర్ఆర్) చిత్రం తరువాత మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం రామాయణం అని కూడా టాక్ వుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమాని.. రాజమౌళి `రామాయణం` శ్రీరాముడి గెటప్‌లో మహేష్ ఇలా ఉంటాడని ఊహిస్తూ ఒక పోస్టర్ ను రూపొందించాడు. ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్లో రాముడిగా మహేష్ గెటప్ అదిరిపోయింది.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more