Rana Daggubati Gets Engaged to Miheeka Bajaj ‘ఇప్పడిక అఫీషియల్’ ఫ్యాన్స్ తో ఫోటోలు పంచుకున్న రానా

Rana daggubati gets engaged to miheeka bajaj at ramanaidu studios

Rana Daggubati, Miheeka Bajaj, rana miheeka, rana marriage, rana engagement, rana daggubati, rana daggubati marriage pics, rana engagement pics, tollywood, movies, entertainment

Actor Rana Daggubati got engaged to his girlfriend Miheeka Bajaj in a private ceremony on Wednesday, and took to social media to share pictures from the event that took place at Ramanaidu Studios in Hyderabad.

‘ఇప్పడిక అఫీషియల్’ ఫ్యాన్స్ తో ఫోటోలు పంచుకున్న రానా

Posted: 05/21/2020 04:32 PM IST
Rana daggubati gets engaged to miheeka bajaj at ramanaidu studios

నటుడు రానా, తనకు కాబోయే సతీమణి మిహికా బజాజ్ తో నిశ్చితార్థం జరుపుకున్నారని వచ్చిన వార్తలను ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు తోసిపుచ్చిన మరుసటి రోజునే ఇంటర్నెట్ లో రానా, మిహికాలో ఫొటోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. రానా దగ్గుబాబు మిహికతో కలసి దిగిన ఫోటోలే ఈ మేర అభిమానులకు సంకేతాలు ఇచ్చాయా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఫోటోలను హీరో రానా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘ఇప్పుడు ఇక అధికారికం’ అని పేర్కొన్నారు.

దీంతో రానా షేర్‌ చేసిన ఫొటోలపై అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. మగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, శివ కార్తికేయన్‌, సైనా నెహ్వాల్‌, అనసూయ.. ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ‘చూడముచ్చటైన జంట. మీ జీవితం మరెంతో సంతోషంగా ఉండాలి’ అని పేర్కొంటూ ట్వీట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. మే నెల ఆరంభంలో తాను మిహికాతో ప్రేమలో ఉన్నానని ప్రకటించి రానా అందర్నీ షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే.

‘తను నాకు అంగీకారం తెలిపింది (లవ్‌ సింబల్‌ ఎమోజీ)’ అని తెలియజేస్తూ రానా మొదటిసారి తన ప్రేయసి మిహికాను సోషల్‌మీడియా వేదికగా అందరికీ పరిచయం చేశారు. కాగా, ఇరు కుటుంబాల పెద్దలు హైదరాబాద్లో కలుసుకున్నారు. రానా-మిహికాల నిశ్చితార్థం, పెళ్లిపనుల గురించి చర్చించుకున్నాయి. అయితే ఈ ఏడాదిలో వీరి వివాహం జరగనుందని ఇటీవల సురేశ్‌ బాబు సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇరు కుటుంబాల పెద్దలు కలవడంతో వీరి పెళ్లి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles