Chiranjeevi recreates a real-life moment with wife ‘‘అమెరికాలో అయినా.. కరోనా లాక్ డౌన్ లోనైనా..’’: చిరంజీవి

Chiranjeevi recreates an old picture from vacation days to this jail lockdown

chiranjeevi, surekha, megastar, joyful holiday, jailfull holiday, America, coronavirus, jubilee hills, chiranjeevi house, twitter, chiranajeevi on surekha, chiranjeevi change, tollywood, movies, entertainment

Megastar Chiranjeevi compared this whole situation to 'jail vibes' in his latest hilarious post. South megastar, wrote, "Joyful holiday in America, 1990." atop it. Along with that, shared a latest picture, recreating the same look and wrote, "'Jailful' holiday in Corona, 2020." atop it.

‘‘అమెరికాలో అయినా.. కరోనా లాక్ డౌన్ లోనైనా..’’: చిరంజీవి ట్వీట్

Posted: 05/18/2020 06:28 PM IST
Chiranjeevi recreates an old picture from vacation days to this jail lockdown

కాలం మారినా.. దేశం మారినా.. తమ దంపతుల్లో ఎటువంటి మార్పు లేదని మెగాస్టార్‌ చిరంజీవి పేర్కొన్నారు. సోమవారం ఆయన పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. ముప్పై ఏళ్ల క్రితం అమెరికా ట్రిప్‌కు వెళ్లినప్పుడు భార్యతో తీసుకున్న ఫొటోను.. ఇప్పుడు లాక్‌డౌన్‌లో క్లిక్‌ మనిపించిన చిత్రాన్ని జత చేసి పంచుకున్నారు. 1990లో అమెరికాలో ఆనందమైన హాలిడేస్‌ను గడిపామని.. ఇప్పుడు 2020లో కరోనా ‘జైల్‌’ఫుల్‌ హాలిడేస్‌ను గడుపుతున్నానని పేర్కొన్నారు. ‘తాను.. నేను.. కాలం మారినా.. దేశం మారినా..’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

30 ఏళ్ల తర్వాత తీసిన ఫొటోలోనూ.. చిరు, సురేఖ 1990 ఫొటోలోని పోజులో కనిపించడం విశేషం. అంతేకాదు అలాంటి దుస్తుల్నే ధరించారు. చూడచక్కగా ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ‘కపుల్‌ గోల్స్‌.. అత్తయ్య, మామయ్య’ అని ఈ ఫొటోకు చిరు అల్లుడు, హీరో కల్యాణ్‌దేవ్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. ‘ఆదర్శ దంపతులు, వావ్‌, మీ టైమింగ్‌ బాగుంది..’ అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. చిరు ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత ‘ఆచార్య’లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్‌ కథానాయిక. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles