టాలీవుడ్ పరిశ్రమలో హ్యాట్రిక్ చిత్రాల హవా నడుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల హ్యట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో టాలీవుడ్ లో వసూళ్ల పండగకు తెరలేపింది. ఇక తాజాగా నందమూరి నటసింహం బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ లో రానున్న తాజా చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి, వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే సింహా, లెజెండ్ సినిమాల బాక్సాఫీసు వద్ద దుమ్మురేపాయి.
దీంతో విరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రంపై ఇప్పటికే హైప్ కోనసాగుతోంది. ఈ కాంబినేషన్లో రానున్న తాజా చిత్రంలో బాలకృష్ణ అఘోరాగా కనపడనున్నట్లు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే బాలకృష్ణ తన మేక్ ఓవర్ ను మార్చుకుంటున్నారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేకోవర్ లో భాగంగానే ఆయన తన హెయిర్ స్టైయిల్ కూడా మార్చుకున్నారని కూడా చిత్రపురిలో ప్రచారం జోరందుకుంది. అయితే ఈ విషయాలపై తాజాగా బోయపాటి స్పష్టతనిచ్చారు.
బాలయ్య అఘోరాగా కనిపించనున్నారన్న వార్తల్లో నిజముందని బోయపాటి క్లారిటీ ఇచ్చారు, తన తదుపరి సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించనున్నారని ప్రకటించారు. ఈ కొత్త సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కరోనా విజృంభణతో లాక్డౌన్ విధించడంతో సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. ఇటీవల ఓ సక్సెస్ మీట్ కు హాజరైన బోయపాటి.. బాలయ్య అభిమానులకు మరోసారి మంచి సినిమాని అందిస్తానని హామిఇచ్చారు. కాగా, ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. అందులో ఓ పాత్రే అఘోరా అని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Feb 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ... Read more
Feb 18 | వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల... Read more
Feb 18 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల... Read more
Feb 16 | బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది... Read more
Feb 15 | మెగాప్యామిలీ నుంచి తాజాగా ఉప్పెన చిత్రంతో తెరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా.. కరోనా తరువాత బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సందడి చేస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి... Read more