Rashi khanna clarifies on acting in World famous lover వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటపై రాశీకన్నా క్లారిటీ

Rashi khanna clarifies on acting in world famous lover

Rashikhanna, Vijaydevarakonda, World Famous Lover, Kranti Madhav, Aishwarya Rajesh, Catherine, Rashikhanna movies, Rashi Khanna photos, Rashi Khanna gallery, Rashikhanna Latest Interview, Tollywood, Vijaydevarakonda, World Famous Lover. Kranti Madhav, Aishwarya Rajesh, Catherine, tollywood, movies, entertainment

Young Talated tollywood Heroine Rashi Khanna speaks on acting in World Famous Lover movies, says she has a new experiance in each and every new movie and has no regrets.

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటపై రాశీకన్నా క్లారిటీ

Posted: 04/30/2020 08:22 PM IST
Rashi khanna clarifies on acting in world famous lover

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పర్చుకున్న యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం వరల్డ్ పేమస్ లవర్. ఈ చిత్రంలో ఒక విజయ్ జంటగా నటించిన రాశీ ఖన్నా కొంత విపరీతమైన సీన్లలో హద్దులు మీరి నటించింది. ఈ చిత్రానికి క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహించారు. ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

అయితే ఈ సినిమాలో విజయ్‌, రాశీకి మధ్య కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాలు ఉన్నాయి. అలాంటి బెడ్‌ సన్నివేశాల్లో నటించాల్సింది కాదని, భవిష్యత్తులో హద్దులు దాటే పాత్రల్లో నటించనని రాశీ ఖన్నా తాజా ఇంటర్వ్యూలో అన్నారంటూ కొన్ని వెబ్‌సైట్లు రాశాయి. ఇలాంటి పాత్రలో నటించడం సరైన నిర్ణయం కాదని ఆమె అభిప్రాయపడ్డట్లు పేర్కొన్నాయి. అయితే తను అలా మాట్లాడలేదని రాశీ ఖన్నా స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు.

తను నటించిన ప్రతి సినిమాను స్వీకరిస్తానని, బాధపడుతూ ఏ సినిమాలోనూ నటించలేదని అన్నారు. ‘చిత్రం విజయం సాధించినా, సాధించకపోయినా.. ప్రతి సినిమా ఒక అందమైన ప్రయాణం. ప్రతి చిత్రం కొత్త విషయాల్ని నేర్పుతుంది. మేమంతా నటులుగా ఇంకాస్త ఎదుగుతాం... నేనెప్పుడూ నా పాత్రల వైపే ఉంటాను. ధన్యవాదాలు’ అని ఆమె పేర్కొన్నారు. రాశీ చేతిలో ప్రస్తుతం ‘సైతాన్‌ కా బచ్చా’ సినిమా ఉంది. కార్తిక్‌ జి. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ సినిమాలో సిద్ధార్థ్‌ కథానాయకుడిగా నటించారు. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం వాయిదాపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles