Anchor Rashmi donates to PM relief fund కరోనాపై యుద్దానికి సమరశంఖం పూరించిన డార్లింగ్

Anchor rashmi donates to pm relief fund to fight agianst coronavirus

Rashmi Gautam, Rashmi, Anchor Rashmi, jabardast Rashmi, Rashmi jabardast anchor, tollywood celebrities, telugu film industry, corornavirus, donation, Telangana, Andhra Pradesh, Pawan Kalyan,nithiin,trivikram,Tollywood celebs generous donations,Telugu celebs generous donations,trivikram srinivas,Dr Rajasekhar,Jeevitha Rajasekhar,coronavirus pandemic,Coronavirus CM relief fund,Coronavirus Chief Minister relief fund,covid-19,ram charan, movies, entertainment, tollywood

Anchor Rashmi donates a good sum to Prime Minister relief fund ie, PM cares fund to fight agianst coronavirus. This jabardast anchor has donated Rs. 25000 to PM Fund.

కరోనాపై యుద్దానికి రష్మీ గౌతమ్.. తన వంతు సాయం

Posted: 03/31/2020 08:01 PM IST
Anchor rashmi donates to pm relief fund to fight agianst coronavirus

కరోనా వైరస్‌ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో మేముసైతం అంటూ సినీప్రముఖులతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు కూడా కదం కలుపుతున్నారు. ఇప్పటికే యాంకర్ ప్రదీప్ టెలివిజన్ రంగంలో రోజువారీ వేతనానికి పనిచేసే 50 నుంచి 60 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలియజేయగా, తాజాగా బుల్లితెర ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా తన వంతు సాయాన్ని ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పాటు రెబెల్ స్టార్ ప్రభాస్ తరువాత ప్రధాని సహాయ నిధికి రాష్ట్రం చలనచిత్ర రంగం నుంచి విరాళాన్ని ప్రకటించింది ఈ జబర్ధస్త్ యాంకర్.

రష్మీ గౌతమ్ పీఎం కేర్స్ ఫండ్‌కి తనవంతు విరాళమందించినట్లు తెలిపింది. బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘జబర్ధస్త్’ షో ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న రష్మీ.. ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తన వంతు సాయం అందించింది. తాజాగా రష్మీ కూడా పీఎం కేర్స్‌కు రూ. 25000 పంపించి తన ఉదారతను చాటుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. పీఎం కేర్స్‌కు పంపించిన ఫండ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ఆమె తన ట్వీట్‌కు యాడ్ చేసింది.

‘నా వంతు సాయం నేను అందించాను. ప్రతి ఒక్కరూ ఈ కష్టకాలంలో తమకు తోచినంతగా సాయం చేయండి’’ అని రష్మీ కోరింది. చాలా మంచి పని చేసావంటూ పలువురు రష్మీని అభినందిస్తుంటే.. టీవీ షోలకు ఎపిసోడ్‌కు ఇంత అని చార్జ్ చేసే రష్మీకి 25 వేలు పెద్ద అమౌంట్ కాదని, పీఎం ఫండ్‌కు కాబట్టి కాస్త పెద్దమొత్తంలో డొనేట్ చేసుంటే బాగుండేది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళమందించింది రష్మీనే కావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles