Chiranjeevi corona crisis charity gets huge donations మెగాస్టార్ చిరంజీవి కరోనా చారిటీకి విరాళాల వెల్లువ

Chiranjeevi corona crisis charity gets huge donations

chiranjeevi, prabhas, Nani, sompurnesh babu, Uv creation, corona crisis charity, Telugu film industry, industry daily labour, CCC Fund, movies, entertainment, tollywood

In the wake of coronavirus and lockdown Tollywood Megastar contributed Rs one Crore to the poor and daily laobur belonging to Telugu Film industry. And also started a corona crisis charity for the benifit of them, which had recieved an amount of RS 6.2 Crores.

మెగాస్టార్ చిరంజీవి కరోనా చారిటీకి విరాళాల వెల్లువ

Posted: 04/02/2020 07:09 AM IST
Chiranjeevi corona crisis charity gets huge donations

కరోనా వైరస్‌ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో మేముసైతం అంటూ సినీ, టీవీ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా కదం కలుపుతున్నారు. అటు దేశప్రధాని మోడీ ఆధ్వర్యంలోని పీఎం కేర్స్ ఫండ్ కు విరాళాలను అందించడంతో పాటు ఇటు ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కూడా విరాళాలను అందిస్తున్నారు. ఇక మరికొందరు ఈ రంగానికి చెందిన ప్రముఖులు.. తమ రంగంలోని కార్మికులను అదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రైసెస్ ఛారిటీకి కూడా విరాళాలను అందజేస్తున్నారు.  

ఈ క్రమంలో లాక్ డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను, సినీరంగంలోని దినసరి కార్మికులను, పేదలను ఆదుకోవడానికి చిరంజీవి నేతృత్వంలో ఏర్పడిన కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు ఎంత నిధి సమకూరిందన్న విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. 'ఇప్పటివరకు 6.2 కోట్ల రూపాయలు సేకరించాం. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతున్నాను' అని చిరంజీవి ట్వీట్ చేశారు. విరాళాలు ఇచ్చిన సినీ ప్రముఖుల పేర్లను చిరంజీవి తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh