ఒక వైపున దర్శకుడిగా సినిమాలు తీస్తూనే, మరో వైపున హీరోగాను ప్రభుదేవా తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఈ దర్శకుడు నటుడిగా నిర్మితమవుతున్న యాభైవ చిత్రం పోన్ మాణికవేల్ విడుదల ఆలస్యం కానుంది. అయితే ఈ తరుణంలో పలు చిత్రాలలో నటించేందుకు ప్రభుదేవా సంతకాలు చేశారు. వాటిలో థీల్, ఓమాయ్ విజిగల్, భగీరా చిత్రాలు శరవేగంగా రూపొందుతున్నాయి. పక్కాగా ప్లాన్ చేసుకుని, కెరియర్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్న ఈ దర్శకనటుడు.. ప్రస్తుతం సైకో మిస్టరీ ధ్రిల్లర్ భగీరాలో సైకో పాత్రలో మెరువనున్నారు.
సైకో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభుదేవా సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారని తాజా సమాచారం. ఇంతకు మునుపెన్నడూ చేయని పాత్రను ఆయన పోషిస్తున్నాడు. ఇప్పటికే అమైరా దస్తూర్ .. గాయత్రిలను ఎంపిక చేశారు. మరో ముగ్గురు కథానాయికల కోసం అన్వేషణ సాగుతోందని తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ఈ సినిమా ఫస్టులుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో చిత్రం షూటింగ్ ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more