విదేశాల నుంచి భారత్ కు వచ్చిన స్వదేశీ ప్రయాణికులతో దేశానికి ఆపద ముంచుకొస్తోందని.. కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. కరోనా వైరస్ భూతం తమిళనాడు రాష్ట్రంలోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సోమవారం ఒక్కరోజే 17 పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇవాళ మరో 7 కేసులను గుర్తించడంతో తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య 74కి పెరిగింది. ఈ క్రమంలో ఇటీవల విదేశాలకు వెళ్లొచ్చిన వారి జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కేంద్ర ఆధీనంలో ఆదాయ శాఖ అధికారులు వెతుక్కుంటూ మరీ వెళ్లి అకస్మికంగా తనిఖీలు చేశారు. తాజాగా రాష్ట్ర వైద్యశాఖ అధికారులు కూడా తమిళ అగ్రహీరో విజయ్ నివాసానికి వెళ్లి పరీక్షలు చేసింది. అదేంటీ ఎందుకీ పరీక్షలు అంటారా.?ఇటీవల కాలంలో టైమ్‌లో విదేశాలకు వెళ్లి వచ్చిన వారి జాబితాను సిద్ధం చేసుకున్న తమిళనాడు ప్రభుత్వం వారి ఇళ్లకు వెళ్లి మరీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే హీరో విజయ్ ఇంటని సందర్శించి పరీక్షలు నిర్వహించారని సమాచారం.
హీరో విజయ్ తోపాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ నిర్ధారణా పరీక్షలు నిర్వహించారు. ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని సదరు ఆరోగ్యశాఖా ప్రతినిధులు నిర్ధారించారు. దీంతో విజయ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమా ఏప్రిల్ 9న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో విడుదల వాయిదా పడనుందని సమాచారం. మాళవిక మోహనన్ కథానాయికగా నటించగా ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించారు.
(And get your daily news straight to your inbox)
Feb 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ... Read more
Feb 18 | వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల... Read more
Feb 18 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల... Read more
Feb 16 | బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది... Read more
Feb 15 | మెగాప్యామిలీ నుంచి తాజాగా ఉప్పెన చిత్రంతో తెరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా.. కరోనా తరువాత బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సందడి చేస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి... Read more