కరోనా వైరస్ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో మేముసైతం అంటూ ముందుకు కదులుతున్నారు సినీప్రముఖులు. ఈ సందర్భంగా నిన్న తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన బాహుబలి సిరీస్ చిత్రాల హీరో డార్లింగ్ ప్రభాస్ తాజాగా మరోమారు విరాళాన్ని ప్రకటించారు. బాహుబలి చిత్రాల నుంచి ఆయన టాలీవుడ్ కే కాకుండా ఏకంగా బాలీవుడ్ హీరోగా ఎదిగిన ప్రభాస్.. తనను ఆదరించిన దేశప్రజలకు కూడా తనవంతుగా సాయాన్ని అందించాడు.
ఇందులోభాగంగా ప్రధానమంత్రి సహాయనిధికి మూడు కోట్ల రూపాయల విరాళం ప్రకటించాడు. దీంతో అతడు ప్రకటించిన విరాళం మొత్తం నాలుగు కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రభాస్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. లాక్ డౌన్ కారణంగా రోజువారీ కూలీలు సహా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు.
వారిని ఆదుకునేందుకు యావత్ దేశం ముందుకొచ్చింది. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు, క్రీడాకారులు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులైన మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నితిన్, త్రివిక్రమ్, దిల్‌రాజు, సాయితేజ్, అల్లరి నరేష్ వంటి వారు తమ వంతు సాయం ప్రకటించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రభాస్ రెండుసార్లు సాయం ప్రకటించడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more