Jr NTR Surprises Ram Charan with special video అల్లూరి ఇంట్రోలో మెరిసిన చరణ్.. భీమ్ వాయిస్ ఓవర్ ఫర్ ఫెక్ట్..

Rrr jr ntr unveils ram charan s stunning first look as birthday treat

ram charan birthday, ntr surpriseRRR movie,rajamouli,jr ntr,ram charan,Ram charan, jr ntr, RRR movie, release date, rajamouli, RRR,RRR Motion Poster,Ram Charan,Jr NTR,SS Rajamouli,MM Keeravani,Madhan Karky,Roudram Ranam Rudhiram, one year to go RRR movie,jr ntr RRR movie one year,RRR movie one year, tollywood, entertainment, movies

After much suspense surrounding the back to back tweets by S S Rajamouli's RRR team, a video showing a gist of what awaits of Ram Charan's performance in the upcoming film was released as a digital gift for the mega powerstar on his birthday today. "As promised, I give you @AlwaysRamCharan Happy birthday brother! Will cherish our bond forever," tweeted NTR.#BheemforRamaraju

అల్లూరి ఇంట్రోలో మెరిసిన చరణ్.. భీమ్ వాయిస్ ఓవర్ ఫర్ ఫెక్ట్..

Posted: 03/27/2020 04:57 PM IST
Rrr jr ntr unveils ram charan s stunning first look as birthday treat

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. పుట్టినరోజును పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సర్ ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చారు. నిర్ధేశించిన సమయం కన్నా కాసింత ఆలస్యంగా విడుదల చేసినా.. మెగా అభిమానులు నిమిషాల వ్యవధిలోనే కొన్ని లక్షల సార్లు దానిని చూసారు. చరణ్ పుట్టినరోజున విడుదలైన ఈ సర్ ప్రైజ్ మెగాపవర్ స్టార్ అభిమానుల నీరిక్షణకు కన్నుల పండువగా మార్చింది.

‘‘రౌద్రం రణం రుధిరం’’.. కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామ రాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు.  ఇందులో రాంచరణ్ పాత్రను ఎన్టీఆర్ పరిచయం చేస్తండగా,  చెరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు. సీతారామ రాజుగా చరణ్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్‌లో ఫైర్..  అచ్చుగుద్దినట్టు దిగిపోయాడు. సెంథిల్ కుమార్ విజువల్స్, కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ముఖ్యంగా సీతారామ రాజు పాత్రను పరిచయం చేస్తూ కొమరం భీం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ రొమాలు నిక్కబొడుచుకునేలా చేసింది.

‘ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు’.. అంటూ తారక్ మాడ్యులేషన్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు.  సర్ ప్రైజ్ పేరుతో రాంచరణ్ బర్త్ డేకు ఎన్టీఆర్ విడుదల చేసిన వీడియో రాకింగ్ అంటూ నెట్ జనులు కూడా కామెంట్లు పెడుతున్నారు. బాహుబలితో దేశవ్యాప్తంగా సత్తా చాటిన జక్కన్న మరోమారు ‘RRR’తో తెలుగు సినిమా సత్తా ఏంటనేది ప్రపంచ సినీ ప్రేక్షకులకు చూపించబోతున్నాడని గర్వంగా ఫీలవచ్చు.. ఫిక్స్ అవచ్చు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  jr ntr  RRR movie  ram charan birthday  ntr surprise  rajamouli  tollywood  

Other Articles