Jr NTR special video gift delayed from RRR చరణ్ కు ఎన్టీఆర్ సారీ.. అంతా జక్కన్న డైరక్షన్ లోనే..

Rrr jr ntr surprise video for ram charan delayed by ss rajamouli

ram charan birthday, ntr surpriseRRR movie,rajamouli,jr ntr,ram charan,Ram charan, jr ntr, RRR movie, release date, rajamouli, RRR,RRR Motion Poster,Ram Charan,Jr NTR,SS Rajamouli,MM Keeravani,Madhan Karky,Roudram Ranam Rudhiram, one year to go RRR movie,jr ntr RRR movie one year,RRR movie one year, tollywood, entertainment, movies

Ram Charan celebrates his 36th birthday today, his co-star, Jr NTR decided to surprise him with a gift., but says sorry as it is not in his hands. He says the delay in caused in the direction of SS Rajamouli.#BheemforRamaraju.

చరణ్ కు ఎన్టీఆర్ సారీ.. అంతా జక్కన్న డైరక్షన్ లోనే..

Posted: 03/27/2020 12:57 PM IST
Rrr jr ntr surprise video for ram charan delayed by ss rajamouli

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ ఉదయం పది గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన ఒక సర్ ఫ్రైజ్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేస్తారని నిన్న ఆయన తన ట్విట్టర్ లో తెలిపారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో దేశం మొత్తం లాక్ డౌన్ చేయడంతో అధికారిక వేడుకలను రద్దు చేసుకున్న చరణ్, ఇంట్లోనే తన కుటుంబసభ్యులతో కలిసి పుట్టినరోజు పండుగ జరుపుకున్నారు.

ఇదిలావుంటే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డేకు ‘రౌద్రం రణం రుధిరం’లో కొమరం భీంగా నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేక సర్‌ప్రైజ్ కోసం ఉదయం 10 గంటల నుంచి అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అందుకు కారణం నిన్న ఎన్టీఆర్ ఇచ్చిన తన ట్వీట్ లోని సారాంశం. తన మిత్రుడు చరణ్ పుట్టిన రోజుని ఎంతో ఘనంగా జరిపే అవకాశం లేనప్పటికీ, రేపు తాను ఇచ్చే బర్త్ డే సర్‌ప్రైజ్‌ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పటికీ మరిచిపోలేరని ఆయన తన ట్విట్టర్ పోస్టు ద్వారా తెలిపారు.

అయితే ఉదయం నుంచి మెగాస్టార్ ఫ్యాన్ సోషల్ మీడియాకే అతుక్కుపోయారు. కానీ ఎక్కడ ఎన్టీఆర్ ‘‘రౌద్రం రణం రుధిరం’’ నుంచి సర్ ప్రైజ్ కనిపించలేదు.. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్‌.. ‘సారీ బ్రదర్‌ రామ్‌చరణ్‌.. రాజమౌళి అభిప్రాయం తెలుసుకుందామని నీ గిఫ్ట్‌ను నేను గత రాత్రి ఆయనకి పంపించాను. రాజమౌళి దగ్గరికి వెళ్తే అది ఎంత ఆలస్యంగా వస్తుందో నీకు తెలుసు కదా.. చిన్న ఆలస్యం’ అని ట్వీట్‌ పెట్టారు. దీనిపై స్పందించిన రామ్‌చరణ్‌..‘ఏంటి ఆయనకి పంపించావా.. ఈరోజుకి వస్తుందా?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చారు.

మరోవైపు సర్‌ప్రైజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంజీవి ట్విటర్‌ వేదికగా రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ‘ఐ యామ్‌ వెయిటింగ్‌.. భీమ్‌ ఫర్‌ రామ్‌రాజు’ అని ట్వీట్‌ చేశారు. చిరు ట్వీట్‌పై స్పందించిన రాజమౌళి.. ‘సార్‌.. అంటే.. అది.. కొంచెం.. కొంచమే.. వాస్తవంగా.. ప్లీజ్‌.. సార్‌’ అని సరదాగా రిప్లై ఇచ్చారు. దీంతో ప్రస్తుతం భీమ్‌ ఫర్‌ రామరాజు అనే ట్యాగ్‌ సోషల్‌మీడియా ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  jr ntr  RRR movie  ram charan birthday  ntr surprise  rajamouli  tollywood  

Other Articles

  • Vice president ap cm naidu condole death of film actor ravi kondala rao

    కళామతల్లి ముద్దుబిడ్డ మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం..

    Jul 28 | ప్రముఖ నటులు, రచయిత, సాహితీవేత్త, పాత్రికేయుడు, దర్శకనిర్మాత రావి కొండలరావు మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కరోనా కష్టకాలంలో సినీపరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడిన... Read more

  • Tv actor ansh bagri badly beaten up by 10 men in delhi

    టీవీ నటుడిపై పది మంది దాడి.. ఇంట్లోకి చోచ్చుకెళ్లి..

    Jul 28 | హిందీ నటుడు అన్ష్ బగ్రీపై దేశరాజధానిలో దాడి జరిగింది. గుర్తుతెలియని పది మంది అగంతకులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన ఇంటి ఆవరణలోకి చోచ్చుకుని వచ్చిన అగంతకులు.. అకారణంగా అతనిపై దాడి... Read more

  • Veteran telugu actor and writer raavi kondal rao passes away at 88

    టాలీవుడ్ లో విషాధం.. రావికొండల రావు కన్నుమూత

    Jul 28 | తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం అలుముకుంది. ఆరు దశాబ్దాల పాటు సినీకళామతల్లికి సేవలు అందించిన కళామతల్లి ముద్దుబిడ్డ, ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, దర్శకనిర్మాత, సాహితీవేత్త, పాత్రికేయుడు రావి కొండలరావు ఇవాళ తుదిశ్వాస విడిచారు.... Read more

  • Tamil actor arrested in chennai for gambling tokens found at flat cops

    నటుడు కిక్ శ్యామ్ ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు

    Jul 28 | సినీపరిశ్రమలో సెలబ్రిటీలుగా ఎదగడానికి చక్కని గుర్తింపుతో పాటు ప్రేక్షకాదరణ పోందడానికి ఎంతో పెట్టి పుట్టాలి. అయితే కొందరు ఎలాంటి కష్టం లేకుండానే దానిని సంపాదించుకుంటారు. మరికోందరు మాత్రం దానిని సంపాదించడానికి అహర్నిశలు కష్టపడతారు. మొత్తానికి... Read more

  • Hero ram charans wife upasana konidela adopts an elephant

    మెగా కోడలు ఉపాసన ఔదార్యం.. గజరాణిని దత్తత..

    Jul 21 | మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల ఔదార్యం మరోమారు బయటపడింది. మెగా కొడలి హోదాతో పాటు అపోలో గ్రూప్ సంస్థల వైస్ చైర్మన్ గా బాధ్యతలు... Read more

Today on Telugu Wishesh