Chiranjeevi's counters to celebrities చిరంజీవి-మోహన్ బాబుల చాట్ నెట్టింట్లో వైరల్..

Chiranjeevi and mohanbabu conters goes viral on net

Megastar Chiranjeevi, social media, Mohan Babu, Collection King, Puri Jagannadh, Kajal, Chiranjeevi latest news, Chiranjeevi tweets, Chiranjeevi Twitter accounts, Chiranjeevi Instagram, Tollywood, Movies, Entertainment

Megastar Chiranjeevi made his debut on social media on the occasion of Ugadi. Many star heroes welcomed him on social media by posting several tweets. Megastar also posted counters to his colleagues. When Mohan Babu tweeted "Welcome Mithrama..", Chiru gave a funniest reply, "Thank you Mitrama @themohanbabu Raananu kunnava... Raalenanukunnava? :)".

చిరంజీవి-మోహన్ బాబుల చాట్ నెట్టింట్లో వైరల్..

Posted: 03/26/2020 08:57 PM IST
Chiranjeevi and mohanbabu conters goes viral on net

మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన కాంబినేషన్‌. కథానాయకుడిగా చిరంజీవి.. ప్రతినాయకుడిగా మోహన్‌బాబు ఎన్నో చిత్రాల్లో నటించారు. చిరు తనదైన యాక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తే, మోహన్‌బాబు తన మేనరిజమ్స్‌, డైలాగ్‌ డెలివరీతో చెరగని ముద్రవేశారు. ఆ తర్వాత కథానాయకుడిగానూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ‘కలెక్షన్‌ కింగ్‌’ అని అభిమానులతో ముద్దుగా పిలిపించుకున్నారు. కాగా, ట్విటర్‌ వేదికగా చిరు-మోహన్‌బాబుల మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది.

తాజాగా చిరంజీవి సామాజిక మాధ్యమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఆయనకు స్వాగతం పలికారు. మోహన్‌బాబు కూడా ట్విటర్‌ వేదికగా చిరంజీవికి స్వాగతం పలుకుతూ ‘మిత్రమా వెల్‌కమ్‌’ అని ట్వీట్‌ చేశారు. అందుకు చిరు సమాధానం ఇస్తూ, ‘థ్యాంక్యూ మిత్రమా.. రాననుకున్నావా.. రాలేననుకున్నావా’ అంటూ ‘ఇంద్ర’లోని డైలాగ్‌తో సమాధానం ఇచ్చారు. వెంటనే మోహన్‌బాబు కూడా అదే స్టైల్‌లో సమాధానం ఇచ్చారు. ‘ఈసారి హగ్‌ చేసుకున్నప్పుడు చెబుతాను’ అంటూ కన్నుకొడుతున్న ఇమోజీని జత చేశారు.

వీరిద్దరి మధ్య జరిగిన ట్విటర్‌ సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా విపరీతంగా హల్‌చల్‌ చేస్తోంది. అభిమానులు సైతం వీరి సంభాషణ చూసి ‘ఎవరూ తగ్గలేదుగా’, ‘ఏంటో మీరు ఇలా ఫన్నీగా ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది’, ‘మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్‌..’, ‘సామాజిక దూరం పాటించండి అంటే, హగ్‌ చేసుకుంటానంటారేంటి’, ‘మీ స్నేహాన్ని ఇలాగే కొనసాగించండి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar Chiranjeevi  social media  Mohan Babu  Collection King  Instagram  Twitter  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh