కరోనా వైరస్ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో మేముసైతం అంటూ ముందుకు కదులుతున్నారు సినీప్రముఖులు. యంగ్ హీరో నితిన్ విరాళంతో ప్రారంభమైన స్వచ్ఛంధ విరాళాల ప్రకటన కార్యక్రమం. ఆ పిమ్మట ఆయన అభిమాన హీరో పవన్ కల్యాన్ ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు జాతీయస్థాయిలో కూడా విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని సహాయనిధికి ఆయన విరాళం ప్రకటించారు. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తన బాబాయ్ నుంచి స్పూర్తిని పోంది విరాళం ప్రకటించారు.
అదే మార్గంలో మెగాస్టార్ కూడా తన వంతుగా కరాళ నృత్యం చేస్తున్న కరోనాపై పోరుకు తన వంతు సాయం అందించారు. అదే బాటలో రెబెల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీయార్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, జీవితా రాజశేఖర్, సుప్రీం సాయి తేజ్ ఇలా అందరూ వరుసగా క్యూ కట్టడంతో ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తాయి. వీరితో పాటు రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ఈ వైరస్ నియంత్రణ చర్యల కోసం తమ వంతు సాయం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల సంక్షేమం కోసం రూ.కోటి ఇవ్వనున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘‘కరోనా వ్యాపిస్తున్న ప్రస్తుత విషమ పరిస్థితులను అధిగమించాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గం. ఇది దినసరి కూలీలు, అల్ప ఆదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఫిల్మ్ వర్కర్స్ సంక్షేమ నిధికి రూ.కోటి విరాళం ఇస్తున్నా’’ అని తెలిపారు. తన విరాళంతో సినీపరిశ్రమలోని దినసరి వేతనంపై జీవించేవారికి కొంతైనా లబ్ది చేకూర్చుతుందని ఆయన ఆశిస్తున్నారు.
కరోనాపై పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూపర్ స్టార్ మహేశ్ బాబు భారీ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50లక్షల చొప్పున విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘‘కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఈ పోరాటంలో నేనూ భాగస్వామిని కావాలనుకుంటున్నాను. ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే, నిబంధనలు పాటించి, లాక్ డౌన్ కు సహకరించండి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒకరికొకరు అండగా నిలబడుతూ మనల్ని మనం సంరక్షించుకోవాలి. మానవత్వంతో ఈ యుద్ధంలో గెలుద్దాం. అప్పటివరకూ ఇళ్లలో భద్రంగా ఉందాం’’ అని మహేశ్ పేర్కొన్నారు.
అగ్ర కథానాయకుడు ప్రభాస్ కూడా కరోనాపై పోరాటంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయన రూ.కోటి విరాళం ప్రకటించారు. ఎన్టీఆర్ కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50లక్షలు విరాళంగా ప్రకటించారు. దీంతో పాటు మరో రూ.25లక్షలు తెలుగు చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమ నిధికి ఇచ్చారు. వీరితో పాటు, ఇప్పటికే పవన్ కళ్యాణ్ - రూ. 2 కోట్లు, నితిన్- రూ. 20 లక్షలు, రామ్ చరణ్ - రూ. 70 లక్షలు, త్రివిక్రమ్ - రూ.20 లక్షలు, అనిల్ రావిపూడి - రూ. 10 లక్షలు, కొరటాల శివ - రూ.10 లక్షలు, దిల్ రాజు-శిరీష్ - రూ. 20 లక్షలు, సాయి తేజ్ రూ.-10లక్షలు విరాళంగా ప్రకటించగా, తన సినిమా కోసం పనిచేస్తున్న 50 మంది కార్మికులకు అల్లరి నరేశ్ ఒక్కొక్కరికి రూ.10 వేలు సాయం చేశారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more