Ay Pilla lyrical song from Naga Chaitanya's Love Story నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ నుంచి రోమాంటిక్ సాంగ్..

New lyrical video ay pilla from naga chaitanya sai pallavi s love story out

Love Story, AyPilla Song, Ai pilla lyrical video Song, Ay Pilla lyrical video Song, Ay Pilla Lyrical song, Naga Chaitanya, Sai pallavi, Love Story Lyrics, Love Story Full Songs, Sekhar Kammula, Pawan Ch, Tollywood, Movies, Entertainment

Buoyed by the overwhelming response to the musical preview of Ay Pilla, the makers of Naga Chaitanya and Sai Pallavi's upcoming romantic entertainer, Love Story, have released the lyrical video of the song. The soulful melody, composed by Pawan CH, with lyrics by Chaitanya Pingali, has been sung by Haricharan.

నాగ చైతన్య-సాయిపల్లవిల ‘లవ్ స్టోరీ’ నుంచి రోమాంటిక్ సాంగ్..

Posted: 03/11/2020 09:24 PM IST
New lyrical video ay pilla from naga chaitanya sai pallavi s love story out

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి ప్రేమలోకంలో విహరిస్తున్నారు. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. ఈ సినిమాలోని ‘ఏ పిల్లా పరుగున పోదామా.. ఏ వైపో జంటగ ఉందామా.. రారా కంచే దూకి చకచక ఉరుకుతు..’ అని సాగే గీతాన్ని విడుదల చేశారు. పాటకు పవన్‌ సీహెచ్‌ చక్కటి సంగీతం అందించారు. హరి చరణ్‌, నకుల్‌ అభ్యంకర్‌ ఆలపించారు. చైతన్య, సాయి పల్లవిపై ఈ పాటను చిత్రీకరించారు. ఇద్దరు సాధారణ మధ్య తరగతికి చెందిన అమ్మాయి, అబ్బాయిగా కనిపించారు. వీరి కెమిస్ట్రీ, ట్యూన్స్‌ యూట్యూబ్‌లో శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి.

‘ఫిదా’ తర్వాత శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా ఇది. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళీ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘వెంకీ మామ’తో ఇటీవల హిట్‌ అందుకున్న నాగచైతన్య ఈ సినిమా తర్వాత పరుశురాం దర్శకత్వంలో నటించబోతున్నారు. సాయిపల్లవి ‘విరాటపర్వం 1922’లో కనిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Chaitanya  Sai pallavi  Love Story  AyPilla Lyrical  Sekhar Kammula  Pawan Ch  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh