IT raid once again in Thalapathy Vijay's house తమిళ అగ్రహీరో విజయ్ నివాసంపై మళ్లీ దాడి

Master controversy it raids vijay s film s co producer lalith kumar s residence

IT raids on vijay, income tax raids on vijay house, thalapathy vijay, income tax raids, Thalapathy Vijay, IT raids, income tax officers, Master movie, thalapathy vijay, income tax raids, master, bigil, Kollywood, Tollywood, Movies, Entertainment

Vijay starrer film Master has come into the spotlight regarding the Income tax evasion. The IT raids happened at the residence and office of Lalith Kumar, the co-producer of this Tamil actioner. This is the second film involving south star Vijay, after Bigil, that came under the IT scanner.

తమిళ అగ్రహీరో విజయ్ నివాసంపై మళ్లీ దాడి

Posted: 03/12/2020 06:06 PM IST
Master controversy it raids vijay s film s co producer lalith kumar s residence

తమిళ స్టార్ హీరో విజయ్ నివాసంపై ఆదాయపన్ను శాఖ అధికారులు మరోమారు దాడులు నిర్వహించారు. ఆయన నివాసంతో పాటు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ప్రస్తుతం మాస్టార్ చిత్రం షూటింగ్ లో బిజీగా వున్న నివాసంలో అదే చిత్రానికి సంబంధించిన సోదాలు నిర్వహించడం గమనార్హం.  ఇవాళ ఉదయం చెన్నైలోని విజయ్‌ నివాసానికి వచ్చిన ఐటీ అధికారులు మరోమారు సోదాలు నిర్వహించారు. గత నెలలోనూ విజయ్‌ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

గత దాడులకు కొనసాగింపుగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో విజయ్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్‌,  ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌ ఇళ్లు, కార్యాలయాలతోపాటు ప్రదర్శన హక్కులు దక్కించుకున్న స్క్రీన్‌ సీన్‌ సంస్థల్లో ఈ సోదాలు చేపట్టారు. కాగా, రెండు రోజుల క్రితం ‘మాస్టర్‌’ సహ దర్శకుడు లలిత్‌కుమార్‌ నివాసంలో సోదాలు జరిగాయి. తాజాగా అధికారులు మరోసారి పణయూర్‌ఇల్లంలోని విజయ్‌ నివాసానికి వెళ్లి సోదాలు చేస్తున్నారు.

గత నెలలో విజయ్‌ ఇంటిపై, ఆఫీసుపై ఏకకాలంలో దాడులు చేసిన ఐటీ అధికారులు.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వారి దాడిలో ఆదాయానికి సంబంధించిన లెక్కలన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయని తెలిసింది. దీంతో విజయ్‌తో పాటు, సినీ వర్గాలు, ముఖ్యంగా ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజగా ఐటీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం విజయ్ మాస్టర్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా ఆడియో ఈనెల 15 వ తేదీన రిలీజ్ కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles