Tamannaah relaxes no kiss condition for Hrithik Roshan హృతిక్ తో ముద్దు కోసం కండీషన్ పక్కకు: తమన్నా

Tamannaah wants hrithik roshan vicky kaushal and prabhas to be in her swayamwar

tamannaah no kiss condition, tamannaah swayamvaram, Prabhas, hruthik roshan, vicky koushal, tamannaah bhatia, marriage, no kiss condition, bollywood, Tollywood, Movies, Entertainment

Actress Tamannaah Bhatia, who will next be seen in Gopichand’s Seetimaar, expressed her crush on Hrithik Roshan, Vicky Kaushal, and Prabhas again and she wants them for her Swayamwar.

హృతిక్ తో ముద్దు కోసం కండీషన్ పక్కకు: తమన్నా

Posted: 03/10/2020 05:57 PM IST
Tamannaah wants hrithik roshan vicky kaushal and prabhas to be in her swayamwar

మిల్కీబ్యూటీ తమన్నా తనకంటూ సినిమాల్లో పెట్టుకున్న కండీషన్ ను పక్కనబెట్టేస్తానని అంటోంది. అయితే దీనికి కూడా కండీషన్స్ అప్లై అంటోందీ అమ్మడు. ఇంతకీ ఏమిటా కండీషన్స్., అంటే సినిమాల్లో ముద్దు, చుంభనం సన్నివేశాల్లో తాను నటించనని ముందుకుముందు తేల్చిచెప్పేస్తుందట అమ్మడు. అయితే ఈ కండీషన్ ను మాత్రం పక్కన బెట్టేస్తానంటోన్న బ్యూటీ.. అందుకు కూడా కండీషన్స్ అప్లై అంటోంది. అయితే ఈ కండీషన్స్ ఏంటా అంటే.. ఈ నో కిస్ కండీషన్ ను కేవలం ఒక్క హీరో విషయంలోనే పక్కన బెడతానని అంటోందట.

ఇంతకీ ఎవరా హీరో అంటే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అని నిర్మోహమాటంగా చెబతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. మొన్న ఆ మధ్యకాలంలో.. తమ కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని తమన్నా తల్లి చెప్పారు. అయితే అవన్నీ తోసిపుచ్చిన తమన్నాను.. ఆమె పెళ్లి గురించి సరదాగా ముచ్చటించగా.. అమ్మడు కూడా అంతే సరదాగా సమాధానాలు ఇచ్చింది. ‘మీకే స్వయం వరం పెడితే.. ఏ నటులు రావాలని కోరుకుంటారు’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా తమన్నా జవాబిచ్చారు.

తన స్వయం వరమా..? అని వీళ్లు.. వాళ్లు అంటూ.. అలోచనలోకి వెళ్లి అంత సడన్ గా అడిగితే ఎలా.? అని ఎదురు ప్రశ్న వేయకుండా.. ఠక్కుఠక్కున బదులిచ్చింది. ఇంతకీ అమెను మీడియా ప్రశ్న.. మీ స్వయం వరానికి ముగ్గురు నటుల్ని ఎంచుకోమని అడగగా.. ‘ప్రభాస్‌, హృతిక్‌ రోషన్‌, విక్కీ కౌశల్‌’ అని సమాధానం చెప్పారు. అంతేకాదు ‘సాధారణంగా నేను స్క్రీన్‌పై కిస్‌ చేయను. నా ఒప్పందాల్లో అది ఒకటి. కానీ హృతిక్‌ రోషన్ తో అయితే చేస్తానని నా స్నేహితులతో జోక్‌లు వేస్తుంటా’ అని ఆమె చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  hruthik roshan  vicky koushal  tamannaah bhatia  marriage  no kiss condition  bollywood  Tollywood  

Other Articles