Surekha birthday celebrated by Cherry, Upasana రామ్ చరణ్, ఉపాసనలతో మెగాస్టార్ సతీమణి సురేఖ

Ram charan upasana celebrates surekha birthday adorable moments

Surekha Birthday, Ram charan Upasana Surekha, Ramcharan wishes to mom, Upasana wishes to surekha, Megastar, Surekha, Chiranjeevi, Mega PowerStar, Ramcharan, Upasana, Instagram, Happy birthday attamma, Tollywood, Movies, Entertainment

Megastar Chiranjeevi wife, Mega PowerStar Ram Charan mother Surekha Konidela celebrating her birthday today. Ram Charan and his wife Upasana celebrated Surekha birthday in a memorable way. Ram Charan shared the birthday celebrations pics through his social media for his fans.

తన మొదటి ప్రేమకు ఉపాసనతో కలసి శుభాకాంక్షలు చెప్పిన చరణ్

Posted: 02/18/2020 04:48 PM IST
Ram charan upasana celebrates surekha birthday adorable moments

మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖతో అమె కుమారుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, తన భార్య ఉపాసనతో కలసి ఇవాళ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను వారిద్దరూ వేర్వురుగా తమ సామాజిక మాద్యమాల్లో పోస్టు చేసి.. కామెంట్లు పెట్టారు. ఈ ఫోటలో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. కొడుకు, కోడలుతో కొణిదెల సురేఖ ఫోటోలు దిగడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా వుందా.? అన్న సందేహాలకు ఈ పోస్టులలోని మ్యాటర్ చూసి మెగా అభిమానులు కూడా అదే పనిగా కామెంట్స్ పెడుతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ పుట్టినరోజు. అమె జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు చెర్రీ అండ్ ఉపాసన. ఈ సందర్భంగా రామ్ చరణ్, కోడలు ఉపాసన సురేఖకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఇందుకు సంబంధిచిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఉపాసన"హ్యాపీ బర్త్ డే అత్తమ్మా... లవ్యూ" అంటూ కామెంట్ రాసి పోస్టు చేశారు. ఉపాసన పోస్టు చేసిన ఫొటోలో రామ్ చరణ్, ఉపాసన మధ్యలో సురేఖ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు.

అదే సమయంలో ఇటు రాంచరణ్ తేజ్ కూడా తన తల్లితో దిగిన ఫోటోను సోషల్ మీడియా అకౌంట్లో ఫోస్ట్ చేసి.. హ్యాపీ బర్తడే అమ్మ.. ఎంత బలీయుడైన అమ్మఒఢిన బాలుడే అంటూ పోస్ట్ చేశాడు. ఈ ఫోటోల్లో తల్లిపై కొడుక్కు వున్న ప్రేమను తెలియజేస్తున్నాయని మెగా అభిమానులు కామెంట్లు చేస్తూ.. పనిలో పనిగా కొణిదెల సురేఖకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. అంతేగా మరి అమ్మ ప్రేమను మరిపించే శక్తి ఎవరికీ లేదుగా మరి.! రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం.. ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. 2021 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar  Surekha  Chiranjeevi  Mega PowerStar  Ramcharan  Upasana  Instagram  Happy birthday attamma  Tollywood  

Other Articles