Krack teaser: Raviteja's Mass Dhamaka అంచనాలు పెంచుతున్న రవితేజ్ ‘క్రాక్’ టీజర్

Teaser talk raviteja s krack meet the krack cop

Krack Movie, Krack Teaser, crack cop, Raviteja, Shruti Hassan, Gopichand Malineni, Thaman SS, B.Madhu, Tollywood, Entertainment, movies

The teaser of Ravi Teja’s next movie ‘Krack’ is out and it looks like a regular one going by the content shown in it. It’s the same vintage Ravi Teja with action blocks occupying the major part of the teaser.

అంచనాలు పెంచుతున్న రవితేజ్ ‘క్రాక్’ టీజర్

Posted: 02/21/2020 06:14 PM IST
Teaser talk raviteja s krack meet the krack cop

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం క్రాక్‌. డాన్‌ శీను, బ‌లుపు లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. దాంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం డూ ఆర్ డై గా మారిపోయింది. అప్పట్లో వరస డిజాస్టర్స్‌తో పూర్తిగా ఇమేజ్ పడిపోతున్న సమయంలో రవితేజతో బలుపు సినిమా చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. మరోసారి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు రవితేజ.

దాంతో ఇప్పుడు కూడా ఇదే చేస్తాడని నమ్ముతున్నారు రవితేజ అభిమానులు. శివరాత్రి సంద‌ర్భంగా క్రాక్ సినిమా టీజర్ విడుద‌ల‌ చేశారు చిత్రయూనిట్. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా ఈ చిత్రం వస్తుంది. ఒంగోల్‌లో రాత్రి 8 గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే.. అనే వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఉత్కఠభరితంగా సాగింది. అప్పిగా, తుప్పిగా, నువ్వు ఎవరైతే నాకేంట్రా నా టోప్పిగా.. అంటూ మాస్ రాజా కూడా తనదైన శైలిలో డైలాగులు అదరగొట్టాడు.

ఈ సినిమాను తమిళ సినిమా సేతుపతి ఆధారంగా తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. టీజర్ షాట్స్ చూసిన తర్వాత కూడా ఇదే అనిపిస్తుంది. విజయ్ సేతుపతి హీరోగా మూడేళ్ల కింద వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. తెలుగులో దీన్ని జయంత్ సి పరాన్జీ జయదేవ్ పేరుతో రీమేక్ చేసాడు. మళ్లీ ఇప్పుడు మరోసారి ఇలాంటి కథతోనే రవితేజ క్రాక్ సినిమా వస్తుందని ప్రచారం జరుగుతుంది. మే 8న సినిమా విడుదల కానుంది. బలుపు తర్వాత మరోసారి మాస్ రాజాతో రొమాన్స్ చేస్తుంది శృతి హాసన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krack Movie  Krack Teaser  Raviteja  Shruti Hassan  Gopichand Malineni  Thaman SS  B.Madhu  Tollywood  

Other Articles