Rashmika fan kiss and run incident రష్మికకు ముద్దుపెట్టి పారిపోయిన ఫ్యాన్

Rashmika mandanna fan kiss and run incident cyberpolice intervenes

Rashmika Mandanna, Fans, selfies, Kiss, rashmika shocking incident, rashmika fan forcible kiss, Molestation, sexual harassment, Bangalore, Karnataka, Sandalwood, Crime, Tollywood, Entertainment, movies

Actress Rashmika Mandanna faced a shocking incident, as one of her fans took a selfie with the actress and also immediately ran away after kissing her. The incident took place at her house, when fans forced her for selfies, which took place in a fraction of seconds.

రష్మికకు పరాభవం.. ఇంట్లోనే ముద్దుపెట్టిన అభిమాని

Posted: 02/18/2020 03:53 PM IST
Rashmika mandanna fan kiss and run incident cyberpolice intervenes

శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి తన అభినయంతో, అందచెందాలతో అటు కన్నడ, ఇటు తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన హీరోయిన్ రష్మిక మందన్నకు పరాభవం ఎదురైంది. అతితక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తున్న ఈ అమ్మడు.. తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో బిజీగా వుంది. ఇటీవలే అమెకు కుక్క బిస్కెట్ తినే అలవాటు ఉందని.. అమెకు సంబంధించిన ఓ రహస్యాన్ని హీరో నితిన్ బయటపెట్టడం అది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు రష్మిక మందనకు సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోకు ముఖ్యకారణమైన రష్మిక ఫ్యాన్ కోసం కర్ణటక రాజధాని బెంగళూరు పోలీసులు తీవ్రంగా అన్వేషిస్తున్నారు. రష్మిక ఫ్యాన్ ఎప్పుడు దొరుకుతాడా.? ఎప్పుడు వాడిని కటకటాల వెనక్కి నెట్టుదామా.? అని తీవ్రంగా సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ అభిమాని నేరుగా రష్మిక ఇంటికి వెళ్లి.. అమె ఇంట్లో.. అమె భద్రతా సిబ్బంది అంతా వుండగా, అమెకు ముద్దుపెట్టి మరీ పరారయ్యాడు. జరిగిన పరిణమానికి అమె షాక్ కాగా, అమె సిబ్బంది ఏం జరిగిందో తెలుసుకుని తేరుకునే లోపు తుర్రుమన్నాడు.

అసలేం జరిగిందంటే.. కర్ణాటకలో రష్మిక తన ఇంట్లో ఉండగా కొందరు అభిమానులు ఆమెను కలిసేందుకు వచ్చారు. అమెతో సెల్పీకోసం వారు కోరారు. దీంతో వారితో పాటుగా బయటకు వచ్చిన రష్మికకు ఓ అభిమాని చాలా దగ్గరగా వచ్చాడు. అమె అలా ముందుకునడుస్తున్న సమయంలో వాడు ఏకంగా అమె చేతిని పట్టిలాగి అమెకు ఎడమబుగ్గపై ముద్దు పెట్టాడు. అంతేకాదు ఏదో చెబుతూ వెనక్కగా పరిగెడుతూ.. పట్టుకోవాలని చూసిన భద్రతా సిబ్బందికి కూడా దొరకకుండా పారిపోయాడు. అభిమాని చేసిన పనికి రష్మిక నిర్ఘాంతపోయింది.

తనకు ఏం జరిగిందో తెలుసుకునే లోపు అభిమాని పారిపోవడం.. అమె షాక్ నుంచి తేరుకోవడానికి కొంచెం సమయం పట్టింది. అయితే అమె భద్రతా సిబ్బంది అభిమానిని పట్టుకునేందుకు ప్రయత్నించి విఫమయ్యారు. సెల్ఫీ పేరుతో ఇలాంటివి ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ నటి సారా ఖాన్ షేక్ హ్యాండ్ ఇస్తే ఓ అభిమాని అమె చేతిని ముద్దాడటానికి ప్రయత్నించి విఫలమైన విషయం తెలిసిందే. అసలే స్టార్ స్టేటస్ వచ్చిందని, వారు సాధారణ ఫ్యాన్స్ ను పట్టించుకోరని విమర్శలు వస్తున్న క్రమంలో తమ హోదాను పక్కనబెట్టి అభిమానుల ముందుకు వస్తే ఇలా పరాభవాలు ఎదురవ్వడం వారికి శరాఘాతంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashmika Mandanna  Fans  selfie  Kiss  rashmika shocking incident  Bangalore  Sandalwood  Tollywood  Crime  

Other Articles