The Most Awaiting Bheeshma Trailer Is Out ‘ఒక్కరు కూడా పడట్లేదు’.. నితిన్ భీష్మ ట్రైలర్

Bheeshma trailer nithiin and rashmika mandanna starrer is more than a rom com

Bheeshma, Bheeshma Trailer, Nithiin, Rashmika Mandanna, Venky Kudumula, Suryadevara Naga Vamsi, Mahati Swara Sagar, Tollywood, Entertainments, Movies

The makers of Nithiin’s upcoming film Bheeshma have unveiled the theatrical trailer on YouTube. Directed by Venky Kudumula of Chalo fame, the film is not just a rom-com as it’s packed with high-octane action, interesting premise and a social message regarding organic crops.

‘ఒక్కరు కూడా పడట్లేదు’.. నితిన్ భీష్మ ట్రైలర్

Posted: 02/17/2020 08:57 PM IST
Bheeshma trailer nithiin and rashmika mandanna starrer is more than a rom com

హీరో నితిన్ చాలా గ్యాప్ తీసుకుని నటించిన ‘భీష్మ’ రోమాంటిక్ సన్నివేశాలే కాకుండా మంచి యాక్షన్.. అంతకుమించి సేంద్రీయ వ్యవసాయంతో కూడిన సబెక్టుతో వస్తోందని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలై టీజర్‌తో పాటు వాట్‌ ఏ బ్యూటీ, సింగిల్‌ యాంథమ్‌ పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి.

రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమాకు చెందిన ధియేట్రికల్ ట్రైలర్ ను చిత్రయూనిట్ ఇవాళ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ‘దుర్యోధనుడు.. దుశ్శాసన.. ధర్మరాజు.. యమధర్మరాజు.. శని.. శకుని పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆ జన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. దాని వల్లేనేమో ఒక్కరూ కూడా పడటం లేదు’ అంటూ నితిన్‌ డైలాగ్ తో మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

నన్ను నీ నుంచి ఎలా కాపాడుకున్నానో.. కంపెనీ కూడా అలానే కాపాడుకుంటాను అన్న రష్మిక డైలాగ్.. నువ్వు ఎన్ని నెలలకు పుట్టావ్.. ఆరు నెలల్లో పుడితే ఏమంటారో తెలుసా.. నెల తక్కువ వెధవ అంటారు అంటూ నితిన్ చెప్పే డైలాగ్స్ అద్యంతం విజిల్స్ కొట్టించేలా వున్నాయి. వ్యవసాయం నేపథ్యంలో సాగుతున్నట్లు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. పీడీవీ ప్రసాద్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles