Former TMC MP Tapas Pal passes away విమానాశ్రయంలో విషాదం.. ప్రముఖ నటుడి మృతి

Tapas pal veteran bengali actor and former tmc mp passes away at 61 in mumbai

Bengali actor, cbi, Dadar Kirti, Tapas Pal, tmc, Tapas Pal death, mumbai, MP, Bengali film, Tollywood, trinamool congress, West Bengal, politics

Veteran Bengali actor and former Trinamool Congress MP Tapas Pal passed away on Tuesday morning at the age of 61 at a private hospital in Mumbai. Pal is survived by his wife Nandini Paul, who is a contestant in this year’s Bigg Boss Bangla, and their daughter Sohini, who is also an actor.

విమానాశ్రయంలో విషాదం.. ప్రముఖ నటుడి మృతి

Posted: 02/18/2020 12:14 PM IST
Tapas pal veteran bengali actor and former tmc mp passes away at 61 in mumbai

ప్రముఖ బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపాస్ పాల్ ఇకలేరు. ఇవాళ ఉదయం ఆయన ముంబై విమానాశ్రయంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. విమానాశ్రయ అధికారులు అతడ్ని వెంటనే జుహూలోని అసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ముంబై నగరంలో నివసిస్తున్న తన కుమార్తెను చూడటానికి వచ్చిన తపాస్ పాల్ అమె ఇంటికి వెళ్లారు. తిరిగి కొల్ కతాలోని తన ఇంటికి వెళ్లేందుకని ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ముంబై విమానాశ్రయానికి వచ్చారు. అయితే విమానాశ్రయానికి చేరుకోగానే అకస్మాత్తుగా గుండెనొప్పికి గురయ్యారు.

దీంతో విమానాశ్రయ అధికారులు ఆయన్ను వెంటనే జుహూలోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఆయన మార్గమధ్యంలోనే మరణించారని వైద్యులు చెప్పారు. తపాస్ పాల్ గత రెండేళ్లుగా హృద్రోగ సమస్యలతో పలుసార్లు ఆసుపత్రిలో చేరారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చందన్ నగర్ లో జన్మించిన తపాస్ పాల్ హుగ్లీలోని మోహసిన్ కళాశాలలో బయోసైన్సులో డిగ్రీ చదివారు. 1980లో తపాస్ పాల్ పలు బెంగాల్ చిత్రాల్లో నటించారు. 1984లో బాలీవుడ్ లోని అబోధ్ చిత్రంతో తెరంగ్రేటం చేశారు. ఈయనకు భార్య నందినీ, కుమార్తె సోహి పాల్ లున్నారు. తపాస్ పాల్ మృతి పట్ల పలువురు బెంగాల్ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles