Nani’s ‘V’ promises a slick action thriller నాని, సుధీర్ బాబుల వి టీజర్ వచ్చేసిందహో.!

The teaser of nani s v promises a slick action thriller that ll keep you guessing

nani v, v movie, v telugu movie, v teaser, v trailer, nani v teaser, nani v trailer, sudheer babu, V, nani, sudheer babu, Nivetha Thomas, Aditi Rao Hydari, Mohana krishna Indraganti, Amit Trivedi, dil raju, v movie, v movie music, nani movies, telugu movies, entertainment, tollywood

The teaser of actor Nani’s upcoming thriller V is out. Directed by Mohana krishna Indraganti, the movie also stars Sudheer Babu, along with music by Amit Trivedi. V is set to be a high-intense thriller, a cat-and-mouse game between two characters, a cop played by Sudheer Babu and the main protagonist with negative shades essayed by Nani.

నాని, సుధీర్ బాబుల వి టీజర్ వచ్చేసిందహో.!

Posted: 02/17/2020 07:44 PM IST
The teaser of nani s v promises a slick action thriller that ll keep you guessing

న్యాచురల్‌ స్టార్‌ నాని, యువహీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వి’ చిత్రం టీజర్ ను ఇవాళ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ లో ఇద్దరు నటుల మధ్య ఆసక్తికరమైన పోరు ఉంటుందన్నట్లు చిత్ర యూనిట్ టీజర్ ను కట్ చేశారు. ఇద్దరు స్టార్స్ మధ్య వైరం బాగానే వున్న బ్యాలెన్సింగ్ గా వెళ్లిలా కథనుసారంగా తెరకిక్కించారు దర్శకుడు మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి. ఇంద్రగంటి దర్శకత్వం రూపోందిన ఈ చిత్రంలో సుదీర్ బాబు పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో ఛేజింగ్ చేస్తుండగా, విలన్ తరహా పాత్రలో న్యాచురల్ స్టార్ నాని కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు సినిమాపై ఎంతో ఆసక్తిని పెంచాయి. కాగా తాజాగా విడుదలైన సినిమా టీజర్ ఫ్యాన్స్ ను అకర్షిస్తోంది. ఇవాళ సాయంత్రం సామాజిక మాధ్యమాల ద్వారా చిత్రబృందం టీజర్ ను విడుదల చేసింది. ఇక ఇద్దరు హీరోలు ఒకరికోకరు చాలెంజింగ్ గా చేసుకునే సవాళ్లు.. డైలాగ్స్ ప్రేక్షకులను అకట్టుకునేలా వున్నాయి. ‘ఫూల్స్‌ మాత్రమే రూల్స్‌ గుడ్డిగా ఫాలో అవుతారు సార్‌.. అప్పుడప్పుడూ నాలాంటోడు కొద్దిగా రూల్స్‌ బ్రేక్‌ చేస్తుంటాడంతే’ అని సుధీర్‌ బాబు అంటున్నారు.

దీంతో సుధీర్ బాబును ఉద్దేశిస్తూ నాని ‘న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడ్డానికి నువ్వు వస్తున్నావనగానే విజిల్స్‌ వేయడానికి నేనేమి నీ ఫ్యాన్ ని కాదురా’, అన్న డైలాగ్..  ‘సోదాపు.. దమ్ముంటే నన్నాపు’ అనే డైలాగులు ఆకట్టుకునేలా ఫ్యాన్స్ చేత ఈలలు వేయిస్తాయి. ఈ చిత్రంలో నివేదా థామస్‌, అదితిరావు హైదరీ కథానాయికలుగా కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈసినిమా ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles