Pawan Kalyan movie Release Date Locked ఫ్యాన్స్ కు వేసవిలో పవన్ కల్యాన్ ట్రీట్..!

Pawan kalyan pink remake release date locked

Pawan Kalyan, pink remake, Pink remake release date, Lawyer saab, Dil Raju, Pink remake, Sriram Venu, Nivetha Thomas, Anjali, total collection, distributors, box office, collections, tollywood, entertainment, movies

Power Star Pawan Kalyan is currently busy in the shoot of his ongoing project, which is tentatively titled Lawyer Saab. The film is remake of Bollywood movie Pink. Pawan Kalyan is planning to wrap up the shoot of this film by the end of March month.

ఫ్యాన్స్ కు వేసవిలో పవన్ కల్యాన్ ట్రీట్..!

Posted: 02/03/2020 08:07 PM IST
Pawan kalyan pink remake release date locked

పవన్ కల్యాణ్‌ తెలుగు చిత్ర పరిశ్రమ ఆశ్చర్యపోయేలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు మొదలు పెట్టేశారు. ఓ వైపు రాజకీయాలలో బిజీగా వుంటూనే ఇటు సినీకెరీర్ ను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ రీమేక్ లో పవన్‌ పవర్ పుల్ న్యాయవాది పాత్రలో నటిస్తున్నారు. దీంతో పాటు, క్రిష్‌, హరీశ్‌ శంకర్‌ సినిమాలు కూడా ఒకే అయిపోయాయి. పవన్ కల్యాణ్‌ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో పవన్‌ నటిస్తున్న ‘పింక్‌’ రీమేక్‌ విడుదలపై స్పష్టత వచ్చింది.

‘‘టైటిల్‌పై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. అయితే,  సినిమాను మాత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళిక రచిస్తున్నాం. ఎందుకంటే మే 11న ‘గబ్బర్‌ సింగ్‌’ విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఉగాది సందర్భంగా టైటిల్‌ను విడుదల చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం ‘జాను’ ప్రచారంలో ఉన్నాం. ఆ తర్వాత ‘వి’ ప్రమోషన్స్‌ ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పవన్‌ సినిమాపై పూర్తి దృష్టి పెడతాం’’ అని దిల్ రాజు అన్నారు.

‘‘తొలిప్రేమ’ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా నేను పనిచేశాను. అప్పటి నుంచే కల్యాణ్‌ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. నేను నిర్మాతను అయితే తప్పకుండా ఆయనతో సినిమా చేయాలని అప్పుడే అనుకున్నా. ఇన్నేళ్లకు కుదిరింది. ‘పింక్‌’ రీమేక్ కు సంబంధించి చాలా మార్పులు చేశాం. హిందీ, తమిళ భాషల్లో విడుదలైన సినిమా మీకు తెలుగులో కనిపించదు. ఒక కొత్త సినిమాను చూస్తారు’’ అని దిల్‌ రాజు తెలిపారు. ఈ సినిమాను వేసవి కానుకగా తీసుకురానున్నట్లు నిర్మాత దిల్‌ రాజ్‌ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Lawyer saab  Dil Raju  Pink remake  Sriram Venu  Nivetha Thomas  Anjali  tollywood  

Other Articles