Uppena first wave: The tide of love! ఆకట్టుకుంటోన్న మెగా వారసుడి ‘ఉప్పెన’ ఫస్ట్ వేవ్.!

Kriti shetty to make telugu debut with uppena her first look poster raises curiosity

Vaishnav Tej debut movie, Kriti Shetty debut movie, Uppena, Uppena First Wave, Kriti Shetty film title, Kriti Shetty first look, Kriti Shetty Uppena poster response, Vijay Sethupathi, Sai Dharam Tej younger brother, Chiranjeevi nephew Vaishnav debut, Sukumar, Buchibabu, Mythri movie makers, DSP, cinema news, latest movie news, movie news, tollywood, trending movie updates, Entertainment

After an impressive first look, now we have the first glimpse of the film ‘Uppena’ which marks the debut of Panja Vaisshnav Tej from the Mega family. The makers called it as ‘First Wave’ to match the title and even the visuals compliment it with the protagonist going against the waves.

ఆకట్టుకుంటోన్న మెగా వారసుడి ‘ఉప్పెన’ ఫస్ట్ వేవ్.!

Posted: 02/05/2020 01:36 PM IST
Kriti shetty to make telugu debut with uppena her first look poster raises curiosity

మెగాఫ్యామిలీ నుంచి వెండితెరపై మెరిసేందుకు మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సుప్రీం హీరో సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌.. హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రి మూవీ మేకర్స్ సహా ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సుకుమార్ వద్ద దర్శకత్వం మెలకువలలో తర్ఫీదు పొందిన బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఈ మూవీతో కథానాయికగా కృతిశెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ప్రీలుక్ లో మత్స్యకారుడిగా మాస్‌ లుక్ తో కనిపించి వైష్ణవ్‌.. సినీప్రియులను మెప్పించారు. ఆ తరువాత చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్ ను విడుదల చేయగా, అందులో వైష్ణవ్‌ లవర్ బాయ్‌ లుక్ లో కనిపించారు. తాజాగా ఈ చిత్రం నుంచి  ఫస్ట్ వేవ్ పేరుతో ఒక ప్రోమోను విడుదల చేసింది. హీరో, హీరోయిన్లను పూర్తిగా చూపించకుండా, ఆ ఇద్దరికి సంబంధించిన విజువల్స్ పై కట్ చేసిన ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది.

కాకినాడ సముద్ర తీరంలోని ఓ జాలరి కుర్రాడి ప్రేమకథగా ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఆయన సిగ్నేచర్ మ్యూజిక్ ఈ ప్రోమోలోను ఆకట్టుకుంటోంది. విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మొదటి సినిమాతో వైష్ణవ్ తేజ్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో, కృతి శెట్టి కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vaishnav Tej  Uppena  Kriti Shetty  First Wave  Vijay Sethupathi  Sukumar  Buchibabu  Mythri movie makers  DSP  Tollywood  

Other Articles