Exhibitors tweet about Darbar's fulfilling performance ఈ సారీ ‘దర్భార్’ దొరవారు కనికరించాల్సిందేనా..

Darbar distributors want rajinikanth to compensate losses

rajinikanth, darbar, darbar box office, Rajinikanth news, Rajinikanth update, darbar flop, darbar collection, AR Murugadoss, darbar total collection, distributors, box office, collections, kollywood, tollywood, entertainment, movies

Superstar Rajinikanth and director AR Murugadoss, the movie was expected to dominate the box office. But, in reality, the film is said to have incurred a huge loss for its producer and distributors as it failed to sell as many tickets as required.

ఈ సారీ ‘దర్భార్’ దొరవారు కనికరించాల్సిందేనా..

Posted: 02/01/2020 05:32 PM IST
Darbar distributors want rajinikanth to compensate losses

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే దేశవ్యాప్తంగానే కాదు ఏకంగా పలు దేశాల్లోనూ ఆయనకు అభిమానులున్నారన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి స్టార్ హీరో మాత్రం కొన్ని రోజుల నుంచి అనుకున్నస్థాయిలో రాణించలేకపోతున్నారు. తన సినిమాలు హిట్ అయినా.. కొంత ఇబ్బందికర పరిణామాలను చవిచూస్తున్నాడు. ఇలా ఎందుకు అంటే.. ఇటీవల ఈ సంక్రాంతి కానుకగా, ప్రపంచవ్యాప్తంగా విడుదలై, మంచి టాక్ ను తెచ్చుకున్న రజనీకాంత్ 'దర్బార్', తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం నష్టాలనే మిగిల్చింది.

సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపే రేంజ్ లో వసూళ్లు రాబట్టినా.. చిత్ర డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఖాళీ జేబులనే చూపుతున్నారు. అంతేకాదు తమ జేబులు నింపాల్సిన బాధ్యత కూడా చిత్రహీరో రజనీకాంత్ దేనని వాఖ్యానిస్తున్నారు. తమను రజనీకాంత్ కనికరించాలని వారంతా కోరాలని నిర్ణయించుకున్నారు. ఎంతో కొంత పరిహారం ఇప్పించాలని కోరుతూ రజనీని కలవాలని పంపిణీదారులు ఎదురు చూస్తున్నారన్న వార్తలు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, లైకా సంస్థ తమ చిత్రం రూ. 150 కోట్లను వసూలు చేసిందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంత భారీ కలెక్షన్లు వచ్చినా, డిస్ట్రిబ్యూటర్లకు నష్టం ఏంటని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles