Mahesh Babu gifts fans 'Sarileru Neekevvaru' trailer అభిమానులకు ప్రిన్స్ గిఫ్ట్: ‘సరిలేరు నీకెవ్వరూ’ ట్రైలర్

Mahesh babu gifts fans sarileru neekevvaru trailer

mahesh babu, prakash raj, anil ravipudi, rajendra prasad, ramya krishna, rashmika mandanna, Vijayashanti, Mahesh Babu-starrer Telugu, Sarileru Neekevvaru, entertainment, movies, tollywood

Telugu superstar Mahesh Babu had gifted his fans with a trailer just after his pre release event of Sarileru Neekevvaru is directed by Anil Ravipudi, which is slated to release on 11 Jan just before Sankranti 2020.

అభిమానులకు ప్రిన్స్ గిఫ్ట్: ‘సరిలేరు నీకెవ్వరూ’ ట్రైలర్

Posted: 01/06/2020 12:02 PM IST
Mahesh babu gifts fans sarileru neekevvaru trailer

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా, లేడీ అమితాబ్ విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రీరిలీజ్ ఈవెంట్ అలా ముగిసీ ముగియగానే అభిమానులకు మరో గిపట్ అందించాడు మహేస్ బాబు. నూటిని రెండువందలపాళ్లు కామెడీతో పాటు ఇటు ప్రకాష్ రాజ్ రోల్ లో విలనిజాన్ని పరిచయం చేస్తూ పోస్ట్ చేసిన ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నిన్న రాత్రి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ట్రయిలర్ కు యూ ట్యూబ్ లో ఇప్పటికే నాలుగు మిలయన్ వ్యూస్ చేరువలోకి చేరింది.

చిత్ర ప్రిరిలీజ్ ఈవెంట్ లోనే దీనిని చిరంజీవి అవిష్కరించారు. ట్రయిలర్ లోనే మహేశ్ బాబు కామెడీ టైమింగ్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రయిలర్ చివరిలో మహేశ్ చెప్పిన "చిన్న బ్రేక్ ఇస్తున్నాను... తరువాత బొమ్మ దద్దరిల్లిపోద్ది" డైలాగ్, హైలైట్ గా నిలిచింది. ప్రకాష్ రాజ్ డైలాగ్స్ ఆయనకే తప్పికొడుతూ.. కాలేజ్ స్టూడెంట్ అనుకుంటున్నావా.; స్టేట్ మినిస్టర్ వి అంటూ అవేశంగా చెప్పిన డైలాగ్ అయన క్యారెక్టర్ లోని డిఫెరెంట్ వేరివేషన్ ను కూడా చూపింది.

రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి డీఎస్సీ సంగీతాన్ని సమకూర్చారు. మహేశ్‌బాబు ఆర్మీ అధికారి మేజర్‌ అజయ్‌కృష్ణగా కనిపించనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నటుడు బండ్ల గణేశ్‌లు ఈ చిత్రంతోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్ బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  rashmika mandanna  Vijayashanti  anil ravipudi  Sarileru Neekevvaru  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh