సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి కీలక పాత్రలో రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరీలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ చిత్ర యూనిట్ లోని ప్రతీ ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుని, జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుని సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నా హీరోయిన్ విజయశాంతి మళ్లీ చిత్రరంగంలోకి రీఎంట్రీ ఇవ్వడం శుభసూచకమంటూ ప్రశంసించారు. హీరో మహేశ్ ముఖంలో చెరగని చిరునవ్వు ఉంటుంది.. అయితే ఆ చిరునవ్వు వెనుక చిన్న చిలిపిదనం ఉంటుంది... దొంగ అంటూ వ్యాఖ్యానించారు. తక్కువ సినిమాలతోనే సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడంటూ సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడిని అభినందించారు.
దక్షిణాదిలో సూపర్ స్టార్ కృష్ణ అంతటి సీనియర్ నటుడు మరెవ్వరూ లేరని, అంతకంటే పెద్ద నటుడు మరొకరు ఉన్నారని తాను అనుకోవడంలేదని తెలిపారు చిరంజీవి. అయితే కృష్ణ గారికి దక్కాల్సిన గౌరవం దక్కలేదేమోనని విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయనకు వచ్చేలాగా చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. 350కి పైగా సినిమాల్లో నటించి, మరికొన్ని చిత్రాలు నిర్మించి, కొత్తదనం కోసం ముందుండే సాహసోపేతమైన వ్యక్తి అని, ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అన్ని విధాలా సరైనదని అభిప్రాయపడ్డారు. మహేశ్ బాబు తనకు పేరు తెచ్చేలా ఎదుగుతుండడం కృష్ణ గారు ఎంతో గర్విస్తుంటారని తెలిపారు.
సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, రిలీజ్ కు ఒకరోజు ముందే తనకు ప్రీమియర్ వేస్తున్నారని చిరంజీవి వెల్లడించారు. హీరోయిన్ రష్మిక మందన్న గురించి చెబుతూ, తనను కాంట్రాక్ట్ కు తీసుకుందంటూ చమత్కరించారు. చలో సినిమా ఈవెంట్ కు వెళితే అక్కడ తొలిసారి కనిపించిందని, ఆ తర్వాత తమ బ్యానర్ లో నిర్మితమైన గీతగోవిందం చిత్రం కోసం వెళితే అక్కడా రష్మికే కనిపించిందని అన్నారు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు కోసం వస్తే ఇక్కడా రష్మికేనంటూ నవ్వులు పూయించారు.
అనంతరం మాట్లాడిన మహేష్ బాబు ఎమోషనల్ ఫీలయ్యారు. ఇదోక మిరాకిల్ డే అని, తమ తమ దర్శకుడు అనీల్ రావిపూడికి ఇవాళ అబ్బాయి పుట్టాడని, నిర్మాత దిల్ రాజు రెండో సారి తాత అయ్యాడని.. తమ ఈవెంట్ రోజున అన్ని మంచి పనులు జరగడం నిజంగా మిరాకిల్ అనిపిస్తోందని అన్నారు. విజయశాంతితో షూటింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కొడుకుదిద్దిన కాపురం చిత్రంలో విజయశాంతి గారితో నటించానని, మళ్లీ ఇన్నాళ్లకు ఆమెతో నటించానని తెలిపారు. ఇప్పటికీ ఆమె క్రమశిక్షణలో ఏమాత్రం తేడాలేదని అన్నారు.
చిరంజీవిలో కూడా తాను అదే అంకితభావం చూశానని తెలిపారు. తమ సినిమా ఒప్పుకోవడం ద్వారా ఆమె తమకు అవకాశం ఇచ్చారని మహేశ్ బాబు వినమ్రంగా తెలిపారు. చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి గురించి చెబుతూ, అంత ఎనర్జీ ఉన్న దర్శకుడ్ని మరెవ్వర్నీ చూడలేదని వెల్లడించారు. రష్మిక గురించి మాట్లాడుతూ, ఎంతో స్వీట్ అంటూ పొగిడారు. అభిమానుల గురించి చెబుతూ, ఏ జన్మలో చేసిన పుణ్యమో ఇలాంటి అభిమానులు దక్కారని ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం లేడి అమితాబ్ విజయశాంతి మాట్లాడుతూ మహేష్ బాబును బంగారంగా అభివర్ణించారు. "చూడ్డానికి ఎంతో క్యూట్ గా ఉంటాడు. పట్టుకుంటే కందిపోయేలా ఉంటాడు. 24 క్యారట్ గోల్డ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మహేశ్ బాబు జెంటిల్మన్. అన్ని పొగడ్తలకు అర్హుడే. ఎంతో నిరాడంబరంగా ఉండే హీరో. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండే మహేశ్ బాబు అంచెలంచెలుగా ఎదిగిన వైనం అద్భుతం. ఈ సినిమాలో కామెడీ, డ్యాన్స్ లో నమ్మశక్యం కాని విధంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు" అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
సూపర్ స్టార్ కృష్ణ సినిమా ద్వారా తాను తెలుగు తెరకు పరిచయం అయ్యానని, ఇప్పుడు ఆయన తనయుడు మహేశ్ బాబు సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మహేశ్ బాబు హీరోగానే కాకుండా సామాజిక సేవల్లోనూ ముందున్నారని, వందలమందికి హార్ట్ ఆపరేషన్లు చేయిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడం మామూలు విషయం కాదన్నారు. మెగాస్టార్ చిరంజీవి గురించి చెబుతూ, ఆయనతో తాను చేసిన సినిమాలన్నీ ఈ సందర్భంగా గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం మంచి హిట్టవ్వాలని ఆశీర్వదించేందుకు వచ్చిన చిరంజీవికి ధన్యవాదాలు అంటూ ప్రసంగించారు.
(And get your daily news straight to your inbox)
Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more
Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more