Jr. NTR To Attend Entha Manchivadavura Event ఎంత మంచివాడవురా ప్రీరిలీజ్ చీఫ్ గెస్ట్ ఆయనే..!

Jr ntr to attend entha manchivadavura event

Entha Manchivadavura, Jr. NTR, Kalyanram, Mehreen Prizada, Nandamuri Balakrishna, JRC Convention center, Hyderabad, Tollywood, Ala Vaikuntapurramuloo, Mahesh babu, Allu Arjun, Bunny, Sarileru Neekevvaru, entertainment, movies, tollywood

Kalyanram film Entha Manchivadavura unit confirmed that Jr. NTR is going to attend their event as chief guest. There were speculations about Nandamuri Balakrishna also attending the event.

‘ఎంత మంచివాడవురా’ ప్రీరిలీజ్ చీఫ్ గెస్ట్ ఆయనే..!

Posted: 01/06/2020 02:24 PM IST
Jr ntr to attend entha manchivadavura event

గ్రామీణ నేపథ్యంతో కూడిన కథలకు ఆదరణ పెరుగుతోన్న తరుణంలో 'శతమానం భవతి' .. 'శ్రీనివాస కల్యాణం' వంటి కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ అడియన్స్ ను తన చిత్రాలకు రప్పించుకున్న దర్శకుడు సతీశ్ వేగేశ్న. కుటుంబ వ్యవస్థతో ముడిపడిన ప్రేమకథలను ఎక్కువగా ఇష్టపడుతూ వాటిని వీక్షించేందుకు అధిక ఆసక్తిని చూపుతున్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిన చిత్రమే 'ఎంత మంచివాడవురా'. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి కుటంబకథా చిత్రంగా.. అన్ని వయస్కులవారు చూడదగిన చిత్రంగా క్లీన్ యు సర్టిఫికెట్ ను పొందింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను జనవరి 15వ తేదీన విడుదల చేయనున్నారు. టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమా సోషల్ మీడియాలో మంచి మార్కులు సంపాదించుకుంటూ వెళుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన రాకని ఖరారు చేస్తూ అధికారికంగా ఒక పోస్టర్ ను కూడా వదిలారు. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ - జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజున రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ కథనాలు .. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles