Mahesh Babu Tamannaah in pakka mass song ‘సరిలేరు నీకెవ్వరూ’ నుంచి మరో సాంగ్ విన్నారా..!

Sarileru neekevvaru mahesh babu tamannaah in pakka mass song

Anil Sunkara, dil raju, mahesh babu, Tamannaah, rashmika mandanna, Sarileru Neekevvaru, Suryudivo Chandrudivo song, Vijayashanti, Prakash Raj, Anil ravipudi, DSP, tollywood, movies, entertainment

After fans anxious waiting for a week, another song of Mahesh Babu’s upcoming actioner Sarileru Neekevvaru has been finally unveiled on social media a few moments. Watch Suryudivo Chandrudivo Lyrical Video Song.

‘సరిలేరు నీకెవ్వరూ’ నుంచి మరో సాంగ్ విన్నారా..!

Posted: 12/30/2019 08:03 PM IST
Sarileru neekevvaru mahesh babu tamannaah in pakka mass song

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇవాళ మరో ట్రీట్ లభించింది. ప్రిన్స్ నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ నుంచి ఇవాళ మరో పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్‌ చేస్తామని గతంలోనే ప్రకటించిన చిత్ర యూనిట్‌.. ఇవాళ తమన్నాతో కలసి చేసిన మాస్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఇదివరకే విడుదలైన ఈ చిత్రం పాటు నెట్టింట్లో హల్ చల్ చేయడంతో పాటు అభిమానులు కూడా అస్వాదిస్తున్నారు.

ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సంక్రాతికి తెలుగు ప్రేక్షకులను ‘సరిలేరు నీకెవ్వరు’తో పలకించేందుకు వస్తున్న సూపర్ స్టార్.. ఇవాళ మరో పాటను విడుదల చేసింది. మహేశ్ బాబు - మిల్కీబ్యూటీ తమన్నా పాటలో స్టెప్పులతో అదరగొట్టారు. ‘ఆజ్‌ రాత్‌ మేరే ఘర్‌మే పార్టీ హై.. తూ ఆజానా..లెట్స్‌ పార్టీ పార్టీ విత్‌ ది సాంగ్‌.. గుర్తుండిపోవాలే లైఫ్‌ లాంగూ..’ అంటూ హిందీ, ఇంగ్లిషు, తెలుగు భాషల్ని కలిసి హుషారుగా సాగిన పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ చక్కటి సంగీతం అందించారు.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ‘అప్పుడే అయిపోయిందా అనకండి. ఆకలి తీరిందా.. తీరకపోతే మళ్లీ చూడండి.. మహేశ్‌ బాంబ్‌’ అని ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి ట్వీట్‌ చేశారు. ఎఫ్‌ 2’ తర్వాత అనిల్‌ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌, సంగీత, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  rashmika mandanna  Tamannaah  Sarileru Neekevvaru  Vijayashanti  Anil ravipudi  DSP  tollywood  

Other Articles