Fans anxiously wait for Rajamouli's 'RRR' latest update ‘ఆర్ఆర్ఆర్’లో లేటెస్ట్ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ నిరీక్షణ..!

Mega and nandamuri fans anxiously wait for rajamouli s rrr latest update

RRR, RRR update, RRR latest Update, ss rajamaouli, RRR, RAM CHARAN, jr ntr,mm keeravani,ali bhatt,rrr new year gift,rrr first look,rrr jt ntr first look,rrr ram charan new look,rama ravana rajyam,titlerajamouli,Ram charan NTR RRR,jr ntr rrr,ram charan rrr,rajamouli rrr,rrr title announcement,komaram bheem birth anniversary,jakkanna,ss rajamouli,rajamouli,rrr movie,rajamouli rrr movie, tollywood, movies, entertainment

Mega Family supporters and Nandamuri Fans are anxiously awaiting for the latest update from the Tollywood best Multistarer Mega Power Ram Charan and Young Tiger Jr NTR starrer, directed the renowned Bahubali series film director SS RajaMouli.

‘ఆర్ఆర్ఆర్’లో లేటెస్ట్ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ నిరీక్షణ..!

Posted: 12/30/2019 07:10 PM IST
Mega and nandamuri fans anxiously wait for rajamouli s rrr latest update

బాహుబలి చిత్రాలతో తన సత్తాను విశ్వవ్యాప్తం చాటిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఆయన రూపోందిస్తున్న తదుపరి చిత్రం కూడా మరో ఎనమిది మాసాల్లో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లోనే క్రేజీ కాంభినేషన్ తో మల్టీస్టారర్ చిత్రాన్ని రూపోందిస్తున్న ఆయన ఒకేసారి అటు నందమూరి అభిమానులతో పాటు ఇటు మెగా అభిమానులను కూడా సంతృప్తి పరిచే కఠినమైన పరీక్షను ఎందుకున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను తన అభిమానులతో పాటు మెగా, నందమూరి అభిమానులతో కూడా పంచుకున్న జక్కన్న.. న్యూఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఇస్తారని అభిమానులు అశిస్తున్నారు. అందుకోసం కళ్లు కాయలు కాచేలా వేచిచూస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా - జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే వారికి సంబందించిన అసలైన RRR ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారా అనే సందేహం కలుగుతోంది.

ఈ చిత్రంలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ జోడీగా హాలీవుడ్ బ్యూటీ 'ఒలివియా మోరిస్' నటిస్తొంది. అలిసన్ డూడీ లేడీ విలన్ రోల్ పోషిస్తుండగా, రే స్టీవెన్ స‌న్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో న‌టించనున్నారు. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RRR  Ram Charan  SS Rajamouli  Jr NTR  Alia Bhatt  Olivia Morris  Ray Stevenson  Alison Doody  tollywood  

Other Articles

Today on Telugu Wishesh