విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే నందమూరి కల్యాణ్ రామ్, ఎవరితో పోటీ లేకుండా తన చిత్రాలను తాను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇది అతని గతంలో స్టైయిల్. ఇక తాజాగా ఈ సంక్రాంతి నుంచి కథలో దమ్ముంటే హిట్టు దానంతట అదే నడుచుకుంటూ వస్తుందని.. ఇక తాను రేసులో వున్నానంటున్నాడు. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేసుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8వ తేదీన హైదరాబాదులో జరపాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు.
ఈ వేడుకకి బాలకృష్ణ - ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా రానున్నట్టు సమాచారం. ఒకే వేదికపై ముగ్గురు నందమూరి హీరోలను చూసే అవకాశం లభించడం పట్ల నందమూరి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమేశ్ గుప్తా .. సుభాశ్ గుప్తా నిర్మించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో శరత్ బాబు, సుహాసిని, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల తదితరులు నటించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more