Ala Vaikunthapurramloo Movie teaser out అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ టీజర్ అదుర్స్..

Ala vaikunthapurramloo teaser well packaged entertainer

#AlaVaikunthapurramuloo, Teaser, Allu Arjun, Pooja Hegde, Tabu, Nivetha Pethuraj, Rajendra Prasad, Jayaram, Samuthirakani, Sushanth, Vennela Kishore, Sunil, Navdeep, Brahmaji, Murali Sharma, Rahul Ramakrishna, Harsha Vardhan, Trivikram, Thaman S, Tollywood, movies, entertainment

Stylish Star Allu Arjun's new movie Ala Vaikunthapurramuloo hits the screens for Sankranthi next year. The makers released the teaser of the movie today to reveal the premise and characters from the movie.

ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ టీజర్..

Posted: 12/11/2019 06:28 PM IST
Ala vaikunthapurramloo teaser well packaged entertainer

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ను ఈ నెల 8న అదివారం రోజునే విడుదల చేయాల్సివుంది. మెగా అభిమాని నూర్‌ అహ్మద్‌ ఆకస్మిక మృతి నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌ విడుదలను వాయిదా వేసింది.

ఈ క్రమంలో టీజర్ గ్లింప్స్ ను ఈ నెల 9న వదిలిన చిత్ర యూనిట్ ఇవాళ సాయంత్రం టీజర్ ను వదిలారు. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. క్లాస్ లుక్ తోను .. మాస్ లుక్ తోను బన్నీ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. క్లాస్ లుక్ తో బన్నీ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. లవ్ .. కామెడీ .. యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పూజా హెగ్డే ఆఫీస్ లోనే బన్నీ పనిచేస్తాడనే క్లారిటీ అయితే ఈ టీజర్ తో వచ్చేసింది.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో 'టబు' కనిపించనుంది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత బన్ని-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్‌ స్వరాలు అందించిన ‘సామజవరగమన’, ‘రాములో రాముల’ పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. టబు, నివేదా పేతురాజు, సుశాంత్‌, రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌, సునీల్‌, నవదీప్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ పతాకంపై, ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌లు నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : #AlaVaikunthapurramuloo  Teaser  Allu Arjun  Pooja Hegde  Suneel  Trivikram  Thaman S  Tollywood  

Other Articles