మెగా అభిమాన సంఘం అధ్యక్షుడిగా అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ మెగా స్టార్స్ ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన నూర్ అహ్మద్ ఆకస్మిక మృతితో దిగ్ర్భాంతికి గురైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దిగ్బ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, అల్లు అరవింద్ స్వయంగా వారింటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
అయితే రామ్ చరణ్ అభిమాని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేకాకుండా 10 లక్షల విరాళాన్ని కూడా ప్రకటించారు. తాను హైదరాబాద్ కి రాగానే అభిమాని కుటుంబాన్ని కలుస్తానని చెప్పుకొచ్చిన ఆయన ఇవాళ అభిమాని కుటుంబానికి పది లక్షల రూపాయలను అందించాడు. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్ సైతం నూర్ మృతికి కదిలిపోయారు. అభిమాని అభిమానాన్ని అర్థిక సాయం ప్రకటించిన చెర్రీ.. తన అభిమానికి అపురూపమై కానుకను అందించాడు. ఏ నటుడు చేయని విధంగా తన అభిమాని అభిమానానికి హద్దులు లేవని.. తన అభిమానాన్ని కూడా అదే విధంగా చూపించాడు చరణ్.
రామ్ చరణ్ సినీ కెరీర్ లో గొప్ప మైలురాయిగా నిలిచిన రంగస్థలం చిత్రంలో నటనకు గాను 'బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్' పురస్కారం లభించగా, ఆ అవార్డును ఇటీవల మరణించిన నూర్ కు అంకింతం ఇస్తున్నట్టు తెలిపారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో చరణ్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూర్ గొప్ప వ్యక్తి అని, తనను, తన తండ్రిని ఎంతో అభిమానిస్తూ, ప్రోత్సహించేవారని కీర్తించారు. ఆయన ఇప్పుడు మనమధ్యలేరని, తనకు అవార్డు నూర్ ఇచ్చినట్టే అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మేం మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నాం సర్... మిమ్మల్ని మిస్సవుతున్నాం అంటూ భావోద్వేగాలకు లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more