Swetha Basu announces divorce in less than a year రోహిత్ మిట్టల్ తో భార్యభర్తల అనుబంధానికి శ్వేతబసు బ్రేకఫ్

Kotha bangaru lokam swetha basu files for divorce

Swetha Basu Prasad, Rohit Mittal, wife and husband relationship, divorce, mutual consent, Bollywood, tollywood, movies, Entertainment

Actress Swetha Basu Prasad and her husband Rohit Mittal is getting divorced even before celebrating their first wedding anniversary, the couple has decided to split. They got married last year on December 13 but according to her differences between them happened six months after they were married.

రోహిత్ మిట్టల్ తో భార్యభర్తల బంధానికి శ్వేతబసు బ్రేకఫ్

Posted: 12/10/2019 08:49 PM IST
Kotha bangaru lokam swetha basu files for divorce

ప్రముఖ నటి శ్వేత బసు ప్రసాద్ సినీపరిశ్రమకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని పట్టుమని పన్నెండు మాసాలు కూడా నిండకుండానే.. అమె అభిమానులు కలత చెందే నిర్ణయాన్ని తీసుకుంది. తన భర్తతో తన భార్య సంబంధాన్ని కొనసాగించలేనని.. అందుకనే తాను తన భర్తతో విడిపోవాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించింది. దీంతో ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్న తమ అభిమాన నటి అప్పుడే విడాకులు తీసుకోవడమేంటీ అంటూ అభిమానులు కలత చెందుతున్నారు.

శ్వేతబసు ప్రసాద్ సినీరంగానికి చెందిన రోహిత్ మిట్టల్ ను ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఏఢాది కూడా తిరగకుండానే వీరు ఆ బంధానికి ముగింపును ఇస్తున్నారు. అయితే ఇది ఏ ఒక్కరి వల్లనో కాకుండా.., ఇద్దరు కలసి చర్చించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు నటి శ్వేతబసు తెలిపింది. తమ వివాహబంధానికి ముగింపు పలకాలని రోహిత్ తో కలసి తీసుకున్న నిర్ణయమని ఇద్దరం కలసి ఈ అంగీకారానికి వచ్చామని అమె తెలిపింది. లోతుగా చర్చించిన తరువాతే తాము ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపింది.

ప్రతి పుస్తకాన్ని మనం పూర్తిగా చదవలేక పోవచ్చని... దీని అర్థం ఆ పుస్తకం బాగోలేదని కాదని చెప్పింది. తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించినందుకు, తనకు స్ఫూర్తిగా నిలిచినందుకు రోహిత్ కు ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపింది. రోహిత్ భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలని ఆకాంక్షించింది. ఇంతగా భర్త కోసం అలోచించే శ్వేతబసు ఎందుకని భర్త నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకుందో అభిమానులకు అర్థంకావడం లేదు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ సినిమాల్లో శ్వేత నటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles