దాదాపు 14 సంవత్సరాల క్రితం.. దేశ రాజధాని ఢిల్లీలో లక్ష్మీ అగర్వాల్‌పై యాసిడ్ దాడి జరిగింది. ‘ప్రేమ’ను నిరాకరించిందనే కోపంతో అందరూ చూస్తుండగానే ఆమెపై యాసిడ్ దాడి చేశాడో దుర్మార్గుడు. అతడి అకృత్యానికి లక్ష్మీ ముఖం, మెడ భాగం పూర్తిగా కాలిపోయాయి. ఎన్నో సర్జరీల అనంతరం కోలుకున్న ఆమె మనో నిబ్బరంతో ముందడుగు వేసింది. తనలాంటి బాధితులకు అండగా నిలిచింది. తాజాగా లక్ష్మీ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం చపాక్. యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో నటిస్తున్న దీపికా పదుకునే తొలిసారిగా నిర్మాత బాధ్యతలు కూడా చేపట్టారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నేడు ‘చపాక్’ ట్రైలర్ రిలీజైంది.
యాసిడ్ బాధితురాలిగా మాలతి (లక్ష్మీ) ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, తనలాంటి అభాగ్యులకు న్యాయం అందేందుకు ఆమె చూపించిన తెగువ ట్రైలర్లో స్పష్టంగా కన్పిస్తోంది. యాసిడ్ దాడి అనంతరం వికృతంగా మారిన తన ముఖాన్ని అద్దంలో చూసుకుని మాలతి భయపడి రోదించడం మనసుల్ని కలిచివేసేదిగా ఉంది. ముఖం ఎదుటివారికి చూపించడానికి కూడా ఇష్టపడని మాలతి.. కొంత కాలం తర్వాత దుపట్టా ఎగరేసి స్వేచ్ఛగా తిరిగే స్థాయికి ఎలా ఎదిగిందో తెలుసుకోవాలంటే ‘చపాక్’ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాధతో కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన లక్ష్మీ పాత్రలో నటించిన దీపికను నెటిజన్లు కొనియాడుతున్నారు. ట్రైలర్ చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘అమ్మాయిలు ముఖంపై వచ్చే మొటిమలనే సహించరు.. అలాంటిది ఆమె యాసిడ్ బాధను ఎలా భరించారో’ అంటూ ఓ నెటిజన్ భావోద్వేగంగా కామెంట్ చేశాడు.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more