నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రూలర్’ టీజర్ రానే వచ్చింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ చిత్రంలో మాస్ డైలాగులు జోడించారు. బాలయ్య ఫ్యాన్స్ కోరుకునేట్టుగా ఫైట్స్ ను కూడా పెట్టారు. పోలీసు దుస్తుల్లో మెరిసిపోతున్న బాలయ్య.. గడ్డంతో కాసింత రఫ్ లుక్ లో కనిపించడం కూడా ఢిఫరెంట్ వేరియేషన్ ను ప్రదర్శింపజేస్తుంది.
సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను గురువారం ఈ చిత్ర బృందం విడుదల చేసింది. టెక్నికల్ సమస్యల కారణంగా ఇదివరకే విడుదల కావాల్సిన టీజర్ వాయిదా పడి ఇవాళ రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకూ ‘రూలర్’ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన బాలకృష్ణ స్టైలిష్, మాస్ లుక్ లు సినిమాపై అంచనాలను పెంచగా, టీజర్ మరింత ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.
‘ఒంటి మీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా.. బయటకు వచ్చిన సింహంలా ఆగను.. ఇక వేటే..’ అంటూ బాలకృష్ణ పలికిన డైలాగ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న‘రూలర్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more