Arjun Suravaram trailer is Intense అదరగొడుతున్న ‘అర్జున్ సురవరం’ ట్రయిలర్

Nikhil siddharth s arjun suravaram trailer intense and gripping

arjun suravaram, arjun suravaram release date, arjun suravaram release date postponed, arjun suravaram trailer, nikhil siddhartha, Lavanya Tripathi, T.N Santhosh, Kavya Venugopal, Akella Rajkummar, Tollywood, movies, entertainment

Arjun Suravaram have finally decided on the film’s release date. Starring Nikhil Siddhartha and Lavanya Tripathi in the leading roles, the movie will hit the theatres on November 29, 2019.

అదరగొడుతున్న ‘అర్జున్ సురవరం’ ట్రయిలర్

Posted: 11/20/2019 04:42 PM IST
Nikhil siddharth s arjun suravaram trailer intense and gripping

యువ నటుడు నిఖిల్ నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’ ట్రైలర్ అందరినీ ఆకర్షిస్తోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి టి.సంతోష్ దర్శకత్వం వహించగా, శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు. నిఖిల్ ఈ చిత్రంలో అర్జున్ అన్న పేరున్న పాత్రికేయుడి పాత్రను పోషించారు. ఈ చిత్రం తన కెరీర్ ను మళ్లీ గాడిన పెడుతుందని ఆశిస్తున్న నిఖిల్.. ట్రైలర్ లో అద్బుత నటనను కనబర్చాడు. పలుమార్లు జాప్యమైన తరువాత వచ్చినా.. అనుకున్న దానికి రెట్టించిన మాస్ మసాలాతో వచ్చిందంటున్నారు నిఖిల్ ఫ్యాన్స్. ఇక ఈ ట్రయిలర్ విడుదలైన 24 గంటల వ్యవధిలోనే ఏకంగా పది లక్షల మంది వీక్షించారు.

సాఫీగా సాగిపోతున్న అర్జున్ జీవితంలో ఓ ఉప్పెన వచ్చి పడుతుంది. అర్జున్ ను వెంటనే అరెస్టు చేయాలి అన్న డైలాగ్ వినిపిస్తుంది... ఒకటి కాదు, రెండు కాదు రూ.13కోట్లు అంటూ పోలీసు అధికారి నిఖిల్ ను విచారిస్తూ కనిపిస్తారు. మరోవైపు ఒక బాధితుడిలా కాదు.. ఒక రిపోర్టర్ లా ఆలోచించాలి అని పోసాని హీరోలో ధైర్యం నింపడం కనిపిస్తోంది. ‘ఇది ప్రతి విద్యార్థికి నా సందేశం.. ఇది మన సమస్య, మనమే పరిష్కరించుకోవాలి’ అని నిఖిల్ చివర్లో చెప్పడం సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. మొత్తానికి ఈ చిత్రం నకిలీ ధృవపత్రాలపై సాగే యుద్దంలా అనిపిస్తోంది. కాగా, ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles