తెలుగు సినిమా రంగం ఉన్నంత కాలం అక్కినేని నాగేశ్వర్రావు గారు ఉంటారు.. Akkineni Nageshwarrao Stays with The Telugu Film Industry Forever

Akkineni nageshwarrao stays with the telugu film industry forever

Akkineni Nageshwarrao,ANR Awards, Tollywood, Awards

Akkineni Nageshwarrao Stays with The Telugu Film Industry Forever

తెలుగు సినిమా రంగం ఉన్నంత కాలం అక్కినేని నాగేశ్వర్రావు గారు ఉంటారు..

Posted: 11/18/2019 11:37 AM IST
Akkineni nageshwarrao stays with the telugu film industry forever

మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరు నటి నటులు  ఉన్న అందరికన్నా. అందరిలో తనకంటు ఒక గుర్తింపు తెచ్చిపెట్టుకున్నా మహానుభావుడు మన అక్కినేని నాగేశ్వరరావు  గారు. తన నటనతో మన ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన  దేవదాసు. .. ఏ పాత్రలో అయిన ఇమిడిపోగలిగే తత్త్వం ఆయనకు అదనపు ఆభరణ.  అయన నటనకు ఆకర్షితులవ్వడం  మన వంతవుతుంది. అయన పేరు మీద ప్రతి ఏటా “అక్కినేని జాతీయ అవార్డుల ప్రధానోత్సవం  “ అట్టహాసంగా  జరుపుతున్నారు..

ఆదివారం నాడు అక్కినేని జాతీయ అవార్డుల  ప్రధానోత్సవాన్ని  అన్నపూర్ణ స్టూడియోస్ లలో అంగరంగ వైభవంగా,అతిరధ సినీ తారలా నడుమా  జరిపారు ..ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖుల హాజరుతో మరింత కళకళ లాడుతూ జరిగినది..అంతే కాకా ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ ప్రముఖులు “ చిరంజీవి గారు,బోణి కపూర్ గారు మరియు  సుబ్బరామిరెడ్డి  “గారు అతిధులుగా హాజరు అయ్యారు..

సభ ప్రాముఖ్యతను పురస్కరించుకొని అక్కినేని నాగార్జున గారు మాట్లాడుతూ ఇలా అన్నారు  నాన్న  గారి  కోరిక మేరకే రేఖ గారికి మరియు శ్రీదేవి గారికి  కి  ఏ. ఎన్నా .ఆర్  అవార్డులు ఇస్తున్నామని తెలిపారు. సినిమా నాకు సర్వసం,అదే నాకు ఎంతో  ఇచ్చింది .. ఆ తల్లి ఋణం తీర్చుకోవడానికి ఒక అవార్డు  సృష్టించబడింది.   తమ  అరుదైన సేవలతో   సినీ రంగాన్నికి   పేరు తెచ్చే కళాకారులకు  ఏ. ఎన్నా .ఆర్  అవార్డులు    లభిస్తుందని, ఈ మాటలన్నీ  నాన్నగారి మదిలోనీ వే అని అక్కినేని నాగార్జున గారు  తెలిపారు. అయన సంకలపమే మమల్ని   నడిపిస్తుందని అంతేకాక  ఆయన ఆలోచనలే మేము ఆచరిస్తున్నాము. చిత్ర పరిశ్రమలో గొప్ప కళకారులను సత్కరించి  నాన్న  గారి పేరు చిరకాలం  ఉండేలా  చేయడానికే ఈ  అవార్డులు  ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శ్రీ దేవి ,రేఖ లకు ఈ అవార్డు లు దక్కాలని నాన్నగారు  ఎపుడు చెప్తుండే వారని అయన సెలవిచ్చారు. . మన  తెలుగు సినిమా రంగం  ఉన్నంత కాలం  “అక్కినేని నాగేశ్వర్రావు  “ గారు మనతోనే  ఉంటారు. ఈ కార్యక్రమంలో నాగ్ చైతన్య,విజయ్ దేవరకొండ,అఖిల్,అమల,మంచు లక్ష్మి,అడవి శేష్ ,నిహారిక మరియు తదితర సినీ తారలు పాల్గొన్నారు..

“ పుల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తే  ఇలా బొమ్మ చేస్తివో  “  అని రాసిన  సీత రామ శాస్త్రి గారి సాహిత్యం .. అక్షర సత్యం మన  అతిలోక సుందరి “  శ్రీదేవి “  గారి గురించి.. అంత అందం, అభినయం కలగలిసిన కలువ పువ్వు ఆమె.. అందం అభినయం తో మంచి కుటుంబం  భర్త దొరకడం శ్రీదేవి గారి అదృష్టం . నేడు  ఆమెలేని  లేటు తన కుటుంబం తో  పాటు యావత్ మన సినీ పరిశ్రమకూడా బాధింపజేసే  విషయం  అని అయన అన్నారు..

ఇక “ రేఖ  “ గారి అందం గురించి మాట్లాడడం మన వంతు  కాదు . నాగార్జున గారు మాత్రం రేఖ  గారిని ఒక రెండు ప్రశ్నలు వేశారు.. మేము కమర్షియల్ సినిమాలతో సతమౌతూ  ఉంటాం ..  ఆ భాద చిరంజీవి గారికి కూడా తెలుసు  కానీ   మీరు ఇటు కమర్షియల్ సిని మాలతో పాటు అటు లీడ్  రోల్స్   ని కూడా చేస్తూ ఎలా విజయాలను సాధిస్తున్నారని ..అంతేకాక మీ అందానికి రహస్యం ఏమిటి ,మీ  అందానికి - వయస్సు కి అసలు సంబంధమే లేదు అని అన్నారు.

నాగార్జున గారి ప్రశ్నలకు రేఖ గారు ఇలా సమాధానమిచ్చారు..సినిమాలో  నటించేటప్పుడు  నాకు ఏమి  తెలీదు ..సిని మా సినిమా అంటే..కమర్షియల్ ,బ్లాక్ అండ్ వైట్ ,నాన్   కమర్షియల్అ అనే ఆలోచనలే లేవు.. మీరు ఎంత అందంగా ఉన్నారో నేను అంతే ఉన్నాను.. అందం అనేది  ఎదుటి  వ్యక్తి చెజ్జ్ చేసే పనిని  బట్టి ఉంటుంది  అని సమాధానమిచ్చారు..

ఏది  ఏమైనా  ఈ ఇరు ముద్దుగుమ్మలు మన తెలుగు వారు కావడం  మనము ఎంతో  గర్వించదగ్గ విషయం..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Nageshwarrao  ANR Awards  Tollywood  Awards  

Other Articles