Mahesh Babu heaps praises on daughter Sitara for Frozen 2 గర్వంగా వుంది ప్రిన్సెస్ సీతూ.!: మహేష్ బాబు ట్వీట్

Confident magical and pure mahesh babu heaps praises on daughter sitara for frozen 2

frozen 2 telugu, sitara Ghattamaneni dub for elsa in frozen 2, mahesh babu daughter sitara, namrata shirodkar daughter sitara, frozen 2 release date, frozen 2 latest, frozen 2 telugu, Tollywood, movies, entertainment

Mahesh Babu took to social media and heaped praises on his cute daughter. The 44-year-old actor wrote “She is truly a mini version of Queen Elsa! Confident, Magical and Pure. So proud of you Situ papa! Can't wait for 22nd November #Frozen2 in Telugu...”

గర్వంగా వుంది ప్రిన్సెస్ సీతూ.!: మహేష్ బాబు ట్వీట్

Posted: 11/20/2019 05:14 PM IST
Confident magical and pure mahesh babu heaps praises on daughter sitara for frozen 2

‘సూపర్‌స్టార్‌’ మహేష్ బాబు గారాల పట్టి సితార తండ్రి తరహాలోనే చిన్ననాటి నుంచే తనలోని నటవారసత్వాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తోంది. బాలనటుడిగా చిన్నప్పుడే వెండితెరపై మెరుపులు మెరిపించిన సూపర్ స్టార్ మాదిరగానే.. ఆయన తనయ సితార కూడా తన మధురస్వరాన్ని వినపించి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారిన విషయం తెలిసిందే. ఏడేళ్ల ప్రాయంలోనే హాలీవుడ్ మూవీకి డబ్బింగ్ చెప్పేసింది.

ప్రపంచ ప్రఖ్యాత నిర్మాత సంస్థ వాల్ట్ డిస్నీ నిర్మించిన ఫ్రోజెన్ 2 చిత్రంలోని బేబీ ఎల్సా పాత్రకు తెలుగులో సితార డబ్బింగ్ చెప్పింది. ఫ్రోజెన్ 2 మూవీ ఈనెల 22న విడుదల కానుంది. దీనితో తమ సూపర్ స్టార్ మహేష్ కుమార్తె చిట్టి సితార వాయిస్ తెరపై విని ఆనందించాలని మహేష్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చేస్తున్నారు. అభిమానులే కాదు.. ఏకంగా మహేష్ బాబు కూడా ఈ నెల 22 ఎప్పుడోస్తుందా.? అని వేయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.  

ఈ మేరకు తన చిన్నారి సితార కోసం మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. తన కూమార్తెను చూస్తే గర్వంగా వుందని అన్నారు. తన కుమార్తె గొంతును తొలిసారిగా వెండితెరపై వినేందుకు ఆగలేకుండా ఉన్నానని మహేశ్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. "ఆమె నిజంగా క్వీన్ ఎల్సాకు మినీ వర్షన్. ఎంతో నమ్మకంగా, మ్యాజికల్ గా, స్వచ్ఛంగా ఉంది. సీతూ పాపను చూస్తుంటే గర్వంగా ఉంది. నవంబర్ 22 వరకూ ఆగలేను" అని ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  superstar  gattamaneni sitara  dubbing artist  frozen-2  Tollywood  

Other Articles